చేరికలకు ఇంకా టైముంది - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చేరికలకు ఇంకా టైముంది

విజయవాడ, డిసెంబర్ 11, (way2newstv.com)
రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే ప్రతీ రోజూ ఏదో విషయం మీద వేడి అలా రాజుకుంటూనే ఉంటోంది. ఇక ఏపీ లాంటి రాష్ట్రంలో సాలిడ్ గా వన్ సైడెడ్ గా విక్టరీ కొట్టిన వైసీపీ ఓ వైపు ఉంది. పూర్తిగా చైతికిలపడిన టీడీపీ మరో వైపు ఉంది. ఆరు నెలల జగన్ పాలన తరువాత కూడా పొలిటికల్ హీట్ ఎక్కడా తగ్గడంలేదు. ఓడిపోయిన మరుసటి రోజు నుంచి బాబు జగన్ ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. జగన్ సైతం మొదట్లో పాలన అంటూ బిజీగా మారినా ఇపుడు మాత్రం రాజకీయం వైపు చూస్తున్నారు. దాంతో ఏపీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గత అసెంబ్లీ సమావేశాల నాటికి 23 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో మెరిసిన టీడీపీ ఈసారి 22 మందితోనే హాజరవుతోంది. గన్నవరం ఎమ్మెల్యే వంశీని టీడీపీ నుంచి విడగొట్టడంతో విజయం సాధించిన వైసీపీ మరి కొందరి మీద కూడా గురి పెట్టిందని అంటున్నారు.
చేరికలకు ఇంకా టైముంది

ఈసారి శీతాకాల సమావేశాల్లోనే వేడి పుట్టించాలనుకున్న జంపింగు జఫాంగులు తమ ఆలోచనలను కొన్నాళ్ళు వాయిదా వేసుకున్నారని అంటున్నారు. అనుకున్న విధంగా రాజకీయం సాగకపోవడంతో పాటు మెడ మీద అనర్హత కత్తి వేలాడుతూండడంతో కొంత వెనక్కుతగ్గారని అంటున్నారు. మరో వైపు ఏపీలో జగన్ సర్కార్ పాలన మీద జనాల అభిప్రాయం ఏంటో తెలుసుకున్న మీదటనే ఆ పార్టీలో చేరాలని కూడా డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. దగ్గరలో లోకల్ బాడీ ఎన్నికలు ఉండడంతో వాటి ఫలితాలు చూసుకున్న మీదటనే కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలన్నది కూడా జంపింగు జఫానుల ఆలోచన‌గా చెబుతున్నారు. కొత్త ఏడాది వస్తూనే ఎటూ స్థానిక ఎన్నికలు ఉన్నాయి. టీడీపీ రాజకీయం కూడా ఆ ఎన్నికల్లో తేలుతుందని కూడా అంచనాలు ఉన్నాయి. తమ బలం ఎక్కడా తగ్గలేదని, మళ్ళీ గెలుస్తామని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. ఓ విధంగా లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీ పుంజుకుంటే అపుడు జంపింగుల్లో పునరాలోచన వచ్చినా రావచ్చు అంటున్నారు.వైసీపీలో చేరేందుకు బీజేపీ రాజకీయం కూడా అడ్డుకట్టగా ఉందని అంటున్నారు. కేంద్రంలోని బీజేపీతో వైసీపీ సంబంధాలు దెబ్బతిన్నాయన్న ప్రచారం ఓ వైపు సాగుతోంది. అది నిజమా కాదా అన్నది కూడా టీడీపీలోని ఎమ్మెల్యేలు జాగ్రత్తగా గమనిస్తున్నారుట. ఒక వేళ జగన్ మీద మోడీ, అమిత్ షా కత్తి కడితే ఆ పార్టీలో చేరినా పెద్దగా ఉపయోగం లేదని భావిస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు. కేంద్రం కనుక తలచుకుంటే ఏపీలో రాజకీయ పరిణామాల్లో వేగంగా మార్పులు వస్తాయని, అయితే జగన్ భారీ మెజారిటీతో గెలిచారని, అందువల్ల ఆయనకు ఉన్న జన బలమే ఇపుడు శ్రీరామ రక్షగా ఉందని అంటున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కనుక అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలితే కేంద్రం సైతం జోరు పెంచే అవకాశాలు ఉన్నాయని కూడా విశ్లేషణలు ఉన్నాయి. ఇక లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే బాబు హుషార్ మామూలుగా ఉండదని, ఒక్కసారిగా ఏపిలో సమీకరణలు కూడా మారుతాయని అంటున్నారు. ఈ మొత్తం పరిణామాలను బేరీజు వేసుకున్న మీదటనే పార్టీ ఫిరాయింపులు ఏపీలో కొనసాగుతాయా, ఆగిపోతాయా అన్నది తేలుతుందని అంటున్నారు.