ఆ ఐదుగురు స్పీడ్ అందుకోలేక... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆ ఐదుగురు స్పీడ్ అందుకోలేక...

విజయవాడ, డిసెంబర్ 11 (way2newstv.com)
ఏపీ అధికార పార్టీ వైసీపీలో పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌కు పార్టీలో గెలిచిన వారికి, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న కొంద‌రికి మ‌ధ్య డిస్టెన్స్ పెరుగుతోందా ? వారిని జ‌గ‌న్ పెద్దగా లెక్కలోకి తీసుకోవ‌డంలేదా? కొంద‌రు యువ నాయ‌కుల‌కు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారా ? వారు మాత్రమే ప్రభుత్వానికి అన్నీ తామై వ్యవ‌హరిస్తున్నారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్రస్తుతం జ‌గ‌న్ ప్రభుత్వంలో పాతిక మంది పైచిలుకు మంత్రులు ఉన్నారు. వీరిలో యువ‌కుల సంఖ్యతోపాటు సీనియర్ల సంఖ్య కూడా ఎక్కువ గానే ఉంది. బొత్స స‌త్యానారాయ‌ణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌, ధ‌ర్మాన కృష్ణదాస్‌, శ్రీరంగ‌నాథ‌రాజు, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వంటి వారు సీనియ‌ర్లే.అయినా.. నేటి కంప్యూట‌ర్ యుగంతో పోటీ ప‌డ‌గ‌లిగే స‌త్తా ఉన్నవారు మాత్రం కాదు. దీంతో వారు చూస్తున్న శాఖ‌ల్లో ప‌నులు న‌త్తన‌డ‌క‌న సాగుతున్నాయ‌నేది వాస్తవం. 
ఆ ఐదుగురు స్పీడ్ అందుకోలేక...

ముఖ్యంగా రెవెన్యూకు ఇప్పుడు అనేక బాధ్యతలు ఉన్నాయి. వ‌చ్చే ఉగాది నాటికి అంటే మ‌రో మూడు మాసాల్లో పేద‌ల‌కు ఇళ్లు ఇవ్వాలి. రేష‌న్ కార్డుల పంపిణీ ఉంది. అయితే, ఆయా ప‌నుల్లో వేగం పుంజుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో వీరికి పెద్దగా జ‌గ‌న్ ప్రాధాన్యం ఇవ్వడం లేద‌నే ప్రచారం సాగుతోంది.ప్రధాన మైన విష‌యాల‌ను యువ మంత్రులుగా ఉన్న కొడాలి నాని, కన్నబాబు అనిల్ కుమార్ యాద‌వ్‌, ఆళ్లనాని, పేర్ని నాని, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూల‌పు సురేశ్, సుచ‌రిత వంటివారికి జ‌గ‌న్ ప్రాధాన్యం ఇస్తున్నారని అంటున్నారు. ఇక‌, అదే స‌మ‌యంలో ఎమ్మెల్యేల విష‌యంలోనూ జ‌గ‌న్ యువ నాయ‌కుల‌కే ప్రాధాన్యం ఇస్తున్నార‌నే ప్రచారం సాగుతోంది. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్రస్వామి స‌హా కాపు రామ‌చంద్రారెడ్డి వంటి వారు ప్రభుత్వంలో కీలకంగా వ్యవ‌హ‌రించాల‌ని భావిస్తున్నారు. అయితే, వీరికి పెద్దగా ప్రాధాన్యం ఉండడం లేదు.నెల్లూరులో మాజీ మంత్రి ఆనం చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీలో నేత‌ల మ‌ధ్య గ్యాప్‌తో పాటు సీనియ‌ర్లు వ‌ర్సెస్ జూనియ‌ర్ల మ‌ధ్య ఎలా పొస‌గ‌డం లేదో తేట‌తెల్లం చేస్తున్నాయి. ఈ ప‌రిణామాలు అన్ని వైసీపీలో జ‌గ‌న్ యువ నేత‌ల‌కు పెద్దపీట వేస్తున్నారా ? అనే చ‌ర్చ సాగుతోంది. కార‌ణాలు ఎలా ఉన్నా.. ఈ మ‌ధ్య కాలంలో ప్రభుత్వం త‌ర‌ఫున వాయిస్ వినిపిస్తున్న వారంతా కూడా యువనేత‌లు, మంత్రులే కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి జ‌గ‌న్ వ్యూహం ఏంటో చూడాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు ప‌రిశీల‌కులు.