నంద్యాల ఆగస్టు 26, (way2newstv.com)
రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి ఇంటిలో సోమవారం నాడు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత దేశంలో ప్రప్రథమంగా బాష ప్రయుక్త రాష్ట్రల ఏర్పాటుకు నాంది పలికి తెలుగు ప్రజలు ఆంధ్ర రాష్ట్రాన్ని సాదించుకున్న విషయం విదితమే. ఇలాంటి చారత్రిక సంఘటనను సాధించు కున్న అక్టోబర్ 1 ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం గా ప్రభుత్వం ప్రకటించాలని ఆయన అన్నారు. ఈ విషయంలో వివిధ పార్టీల వారు కూడా ప్రభుత్వం ప్రకటించే లాగా నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం అక్టోబర్ 1 వ తేదీన జరపాలి
రాయలసీమ జిల్లాల సహకారం లేకుండా ఆంధ్ర రాష్ట్ర సాధన జరిగిందని . . నూతన తెలుగు రాష్ట్రంలో రాయలసీమ అభివృద్ధి కి ప్రదాన్యత ఇస్తామని అలనాటి ప్రముఖుల ఒప్పందం జరిగిందని . కీలక మైన అంశాలు. రాజధాని. మరియు హైకోర్టు ను రాయలసీమ లోనే ఏర్పాటు చేయాలని. మరియు క్రుష్ణ తుంగభద్ర నీటిని రాయలసీమ సంపూర్ణ అవసరాలకు ఉపయోగించే విధంగా అలనాటి ప్రముఖులు ఒప్పందం లో (శ్రీ బాగ్ ఒడంబడిక) . రాచుకున్నట్లు . ఆయన గుర్తు చేశారు. అలనాటి ప్రముఖులు ఇచ్చిన మాట ప్రకారం రాయలసీమ లో రాజధాని నిర్మాణం. మరియు హైకోర్టు కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నామని అన్నారు . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం అక్టోబర్ 1 వతేదిన జరపాలని ప్రభుత్వం వారిని డిమాండ్ చేస్తున్నాము . ఈ సమావేశంలో బోజ్జా దశరథ రామిరెడ్డి. వై ఎన్ రెడ్డి. ఎర్వ రామచంద్రారెడ్డి. సాథాగర్ కాసిం మియా. మహేశ్వర రెడ్డి. వెంకటేశ్వర నాయుడు. భాస్కర్ రెడ్డి. ఎంవి రమణా రెడ్డి. సుధాకర్ రావు. రిటైర్డ్ టెంకాయలు వెంకటసుబ్బయ్య. క్రిష్ణ మోహన్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు
Tags:
Andrapradeshnews