ఏసీబీ వలలో చాగల్లు ఆర్ ఐ

ఏలూరు ఆగస్టు 20 (way2newstv.com):
పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు తహసీల్ధార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. పట్టాదారు పాస్ పుస్తకం కోసం రూ.2 వేలు లంచం తీసుకుంటున్న చాగల్లు రెవిన్యూ ఇన్స్పెక్టర్ గాది సుబ్బారావుని పట్టుకున్నారు.  చాగల్లు మండలం ఎస్.ముప్పవరం గ్రామానికి చెందిన అయినం దుర్గ ప్రసాద్ కి చెందిన 1.75 ఎకరాల పొలానికి సంభందించి పట్టాదారు పాస్ పుస్తకం కోసం ఆర్ ఐ డిమాండ్ చేసినట్లు ఆరోపణ.  చాగల్లు తహశీల్దార్ కార్యాలయంలో అధికారులతో  ఏసీబీ అధికారులు  విచారణ జరిపారు. 
ఏసీబీ వలలో చాగల్లు ఆర్ ఐ
Previous Post Next Post