జగన్ కు కన్నా ధ్యాంక్స్

గుంటూరు, ఆగస్టు 28 (way2newstv.com)
రాజధాని తరలింపుపై రగడ కొనసాగుతోంది. వైసీపీ సర్కార్‌పై నిప్పులు చెరుగుతున్న బీజేపీ.. రెండు రోజులుగా రాజధాని ప్రాంతంలో పర్యటిస్తోంది. జగన్ ప్రభుత్వం టార్గెట్‌గా విరుచుకుపడుతోంది. అయితే ఈ క్రమంలో వైఎస్ జగన్‌కు కన్నా లక్ష్మీనారాయణ ధన్యవాదాలు తెలిపారు. అదేంటి నిన్నటి వరకు ముఖ్యమంత్రిపై విమర్శలు చేసిన వ్యక్తి ధన్యవాదాలు చెప్పడమేంటని షాకవుతున్నారా. 
జగన్ కు కన్నా ధ్యాంక్స్

నిజమే రాజధాని విషయంలో ముఖ్యమంత్రికి బీజేపీ అధ్యక్షుడు థ్యాంక్స్ చెప్పారు. రాజధాని ప్రాంత రైతులు కౌలు డబ్బు అందకపోవడంతో ఆందోళనలో ఉన్నారు. కన్నాను కలిసి తమ సమస్యను చెప్పుకొన్నారు.. వెంటనే ఆయన జగన్‌కు లేఖ రాశారు. తాజాగా ప్రభుత్వం కౌలు చెల్లించేందుకు నిధులు విడుదల చేయడంతో.. కన్నా ట్విట్టర్‌లో స్పందించారు. ‘ప్రభుత్వం తమకు కౌలు చెల్లించడం లేదంటూ గత కొద్దిరోజులుగా రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చెంది నన్ను కలిసిన సందర్భంలో మీకు (ముఖ్యమంత్రి జగన్) ఈ అంశంపై బహిరంగ లేఖ రాసాను. దీనికిపై స్పందిస్తూ రూ. 187.40 కోట్లను విడుదల చేస్తూ మంగళవారం జీవో జారీ చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు’తెలిపారు
Previous Post Next Post