జగన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ

నెల్లూరు, ఆగస్టు 26 (way2newstv.com
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును మరోసారి టార్గెట్ చేశారు వైఎస్సార్సీపీ ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. గత టీడీపీ ప్రభుత్వం మహిళలను అన్ని రంగాల్లో వేధించిందని విమర్శించారు. మహిళలపై దాడులకు పాల్పడినా పట్టించుకోలేదని.. ఆడవాళ్ల తాళిబొట్టు తెగినా చంద్రబాబు చలించలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. కాల్‌మనీ సెక్స్‌రాకెట్ పేరుతో మహిళలపై దాష్టీకాలకు తెగబడ్డారన్నారు. తాడేపల్లిలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన రోజా చంద్రబాబుపై ధ్వజమెత్తారు. 
జగన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ

సీఎంగా ఉండి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం బాబుకే చెల్లిందని.. మగబిడ్ద కంటానంటే అత్తవద్దంటుందా అంటూ మహిళలను అవమానించారన్నారు. బాబు దారిలోనే ఆ పార్టీ నేతలు కూడా మహిళలను తక్కువ చేసి మాట్లాడారన్నారు. అసెంబ్లీ పూజారినని చెప్పుకున్న మాజీ స్పీకర్ కోడెల కారు షెడ్డులో ఉండాలి.. ఆడవాళ్లు ఇంట్లో ఉండాలనంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంఘటన అందరికీ గుర్తుందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. పదవులు.. పనులు మహిళలకు యాభై శాతం కేటాయిస్తూ జగనన్న చట్టం తెచ్చారన్నారు. కేబినెట్‌లోనూ మహిళలకు ప్రాధాన్యం కల్పించారని.. ఇద్దరు ఎస్సీ మహిళలకు మంత్రివర్గంలో చోటు కల్పించి మహిళల పట్ల తన నిబద్ధతను చాటుకున్నారన్నారు. ఎస్టీ మహిళకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం ఆయన ఔన్నత్యానికి నిదర్శనమని ప్రశంసించారు. 
Previous Post Next Post