గవర్నర్ నరసింహన్ కు తెలంగాణ ఉద్యోగుల సంఘం ఘన విడ్కోలు

హైదరాబాద్ సెప్టెంబర్ 5 (way2newstv.com)
రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ కు తెలంగాణ ఉద్యోగుల సంఘం ఘనంగా విడ్కోలు పలికింది. ఈ సందర్బంగా సంఘం అధ్యక్షులు  ఎ. పద్మాచారి. ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ గౌడ్ లు మాట్లాడుతూ తెలంగాణకు నీళ్లు నియామకాలలో, ఉద్యోగులకు, నిరుద్యోగులకు జరిగిన అన్యాయం గురించి క్షుణ్ణంగా తెలిసిన మన గవర్నర్ తెలంగాణకు జరుగుతున్నఅన్యాయాన్ని కేంద్రానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ తెలంగాణ సాధనకు తన వంతు సహాయం అందించారని పద్మాచారి అన్నారు.  
గవర్నర్ నరసింహన్ కు తెలంగాణ ఉద్యోగుల సంఘం ఘన విడ్కోలు

సుదీర్గంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు బంగారు తెలంగాణ సాధనలో ప్రభుత్వం, ఉద్యోగులు, ప్రజలతో మమేకమై తనవంతు సహాయంగా రాజకీయంగా, శాస్త్రీయంగా,  ఆధ్యాత్మికపరంగా, సాంస్కృతిక పరంగా ప్రతి విషయంలో కూడా నేను సైతం అని తెలంగాణ జన జీవన స్రవంతిలో కలిసి ఒక గొప్ప వ్యక్తి గవర్నర్ నరసింహన్ అని పద్మాచారి కొనియాడారు.
Previous Post Next Post