సీఎం జగన్ ను కలిసిన సీంధు

అమరావతి సెప్టెంబర్ 13, (way2newstv.com)
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు, ముఖ్యమంత్రి  వైయస్. జగన్మోహన్ రెడ్డిని శుక్రవారం సచివాలయంలో కలుసుకున్నారు. సింధుకు  ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో సింధు గోల్డ్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. 
సీఎం జగన్ ను కలిసిన సీంధు

ఈ  కార్యక్రుమంలో  సింధు తల్లిదండ్రులతో పాటు,  మంత్రి  అవంతి శ్రీనివాస్, శాప్ అధికారులు  ఉన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ  సింధు భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని అన్నారు. ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. తరువాత పీవీ సింధు మాట్లాడుతూ, వైజాగ్ లో అకాడమీ నెలకొల్పేందుకు ఐదు ఎకరాల స్థలాన్ని ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని తెలిపింది.
Previous Post Next Post