హైదరాబాద్, సెప్టెంబర్ 4, (way2newstv.com)
హైదరాబాద్ బొగ్గులకుంట లోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో మరో 4 ప్రధాన దేవాలయాలలో ఆన్ లైన్ సేవలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం, వరంగల్ భద్రకాళి ఆలయం, కొండగట్టు ఆంజనేయస్వామి, ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి ఆలయాలలో టీ యాప్ ఫోలియో మొబైల్ యాప్, మీ సేవా ద్వారా ఆన్ లైన్ సేవలు పొందవచ్చు మంత్రి మాట్లాడుతూ భక్తుల సౌకర్యం కోసం రాష్ట్రములో 11 ప్రధాన ఆలయాలలో ఈ ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాం.
ఆలయాల్లో ఆన్ లైన్ సేవలను ప్రారంభించిన మంత్రి
దీంతో పాటు భక్తులకు కొరియర్ ద్వారా ప్రసాదాలను పంపిణీ చేస్తున్నాం. వేములవాడలో ఆలయ ప్రసాద కొరియర్ సేవలను రేపు ప్రారంభిస్తామని అన్నారు. దేవాలయాల అభివృద్ది, ఆలయ అధికారులు, అర్చకుల సక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నారు. కాళేశ్వరం నీళ్లను మిడ్ మానేరు ద్వారా వేములవాడ గుడి చెరువులోకి రేపు నీటిని విడుదల చేస్తామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, అదనపు కమిషనర్ శ్రీనివాస రావు, సంబంధిత ఆలయ ఈవోలు, ఐటీ అండ్ సీ సిబ్బంది పాల్గొన్నారు
Tags:
telangananews