గుంటూరు సెప్టెంబర్ 9, (way2newstv.com)
సోమవారం తెల్లవారుజామున గుంటూరు రైల్వే స్టేషన్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డికి బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుగు కన్నా లక్ష్మీనారాయణ,ఇతర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. గుంటూరులో పలు కార్యక్రమాల్లో పాల్గోవటానికి వచ్చిన హోమ్ శాఖ సహాయ మంత్రి హైద్రాబాద్ నుండి రైలు మార్గాన తెల్లవారు 3 గంటలకు గుంటూరుచేరుకొన్నారు. కన్నా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గంగానది మట్టితో 30ఆడుగుల విగ్రహానికి పూజ నిర్వహించారు.
గుంటూరులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తరువాత పార్టీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. తరువాత అయనను టీడీపీ నేతలుకలిసారు.. వైసీపీ దాడులపై ఈ సందర్భంగా బాధితులు కిషన్ రెడ్డి కి ఫిర్యాదు చేశారు. టీడీపీ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్నామని వాపోయారు. తమకు అండగాఉండాలని కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఐజీ, డీజీపీతో మాట్లాడతానని పల్నాడు బాధితులకు కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.తరువాత అయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశాన్ని దశాబ్దాలుగాపట్టి పీడిస్తున్న సమస్యలను పరిష్కరించేందుకు మోదీ కృషి చేశారని ప్రశంసించారు.అలాగే సంస్కరణల్లో వేగం పెరిగిందనీ, ప్రతీఒక్కరి సంక్షేమం, సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్నామని చెప్పారు. మోదీ సారథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ అదనంగా లక్ష కోట్ల డాలర్ల స్థాయికిచేరుకుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాదిలో 3 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఏర్పడనుందని చెప్పారు. మోదీ ప్రభుత్వం వచ్చాక 3 నెలల్లోనే 30 బిల్లులను ఆమోదించామనీ, ఇది ఓ చరిత్రనివ్యాఖ్యానించారు. ఒకే దేశం-ఒకే పవర్ గ్రిడ్ విధానంతో ముందుకెళుతున్నామని చెప్పారు.
Tags:
Andrapradeshnews