జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి
కానిస్టేబుల్ అభ్యర్ధులకు దృవ పత్రాల పరిశీలన ప్రారంభం
ధృవపత్రాలలో తప్పుడు సమాచారం ఇవ్వరాదు.
కర్నూలు, అక్టోబర్ 03 (way2newstv.com)
పోలీసుశాఖలోని కానిస్టేబుల్ దేహాధారుడ్య మరియు రాత పరీక్షలకు హాజరై అర్హత సాధించి స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుల్ (సివిల్, ఎఆర్, ఎపిఎస్పీ), వార్డర్, ఫైర్ మెన్ఉద్యోగాలకు జిల్లా కు ఎంపికైన 259 మంది అభ్యర్దులకు గురువారం జిల్లా పోలీసు కార్యాలయం లోని వ్యాస్ ఆడిటోరియంలో ధృవ పత్రాల పరిశీలన జరిగింది.
కానిస్టేబుళ్ళుగా జిల్లాకు ఎంపికైన 259 మంది అభ్యర్దులకు అభినందన
ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎంపికైన అభ్యర్ధులు ధృవపత్రాల పరిశీలనలో తప్పుడు సమాచారం ఇవ్వకూడదన్నారు. ఏక్కడైనా పోలీసు కేసులలో ఉన్నట్లయితే తప్పనిసరిగా సంబంధిత ధృవపత్రంలోకనబరచాలన్నారు. కానిస్టేబుళ్ళుగా జిల్లాకు ఎంపికైన అభ్యర్ధులను అభినందిస్తున్నామన్నారు. ఇందులో 180 మంది సివిల్ కానిస్టేబుళ్ళు , 08 మంది ఆర్ముడు రిజర్వుడుకానిస్టేబుళ్ళు , 30 మంది ఎపిఎస్పీ కానిస్టేబుళ్ళు, 11 మంది వార్డర్ కానిస్టేబుళ్ళు , 30 మంది ఫైర్ కానిస్టేబుళ్ళుగా ఉన్నారన్నారు. వైద్య పరీక్షలకు కూడా సిధ్దంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలన అధికారి సురేష్ బాబు, ఎస్పీ పిఎ రంగస్వామి, ఈ కాప్స్ ఇంచార్జ్ రాఘవరెడ్డి, ఆర్ ఐలు రంగముని , రామక్రిష్ణ, డిపిఓసిబ్బంది ఉన్నారు.
Tags:
Andrapradeshnews