హుజూర్‌నగర్ లో 26 వ తేదీన టీఆర్‌ఎస్ బహిరంగ సభ

హైదరాబాద్ అక్టోబర్ 24 (way2newstv.com)
హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థికి అఖండ మెజార్టీ ఇచ్చి బ్రహ్మాండమైన విజయాన్ని అందించినటువంటి హుజూర్‌నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ సీఎం కేసీఆర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. హుజూర్‌నగర్ ఉపఎన్నిక విజయం అనంతరం సీఎం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... ప్రతీకూల వాతావరణ పరిస్థితుల్లో నేను వెళ్లలేకపోయినప్పటికీ కూడా ప్రజలు అద్భుత మెజార్టీ ఇచ్చారు. ఇది ఏదో ఆశామాషీగా అలవోకగా వేసిన వేటు అనుకోవటం లేదు. చాలా ఆలోచన చేసి వేసినట్లుగా భావిస్తున్నాం. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సంవత్సర కాలంలో జరిగినటువంటి ఉపఎన్నిక ఇది. 
 హుజూర్‌నగర్ లో 26 వ తేదీన టీఆర్‌ఎస్ బహిరంగ సభ

పనిచేస్తూ పోతున్నటువంటి ప్రభుత్వానికి ఈ విజయం ఒక టానిక్‌లాగా పనిచేస్తుంది. ఈ గెలుపుపై ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు 26 వ తేదీన బహిరంగ సభ నిర్వహించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. హుజూర్‌నగర్ ప్రజల ఆశలనుఆకాంక్షలను నెరవేరుస్తామని సీఎం హామీ ఇచ్చారు. ప్రతిపక్షాలు ఇకనైనా లేనిపోని విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. మరింత ఉత్సహాంతో పనిచేయడానికి అవకాశం కల్పిస్తుంది. ప్రతిపక్షాల పార్టీలు చాలారకాల దుష్ప్రచారాలు చేశారు. చాలా నీలాపనిందలు వేశారు. వ్యక్తిగతమైన నిందలు సైతం చేశారు. వాటన్నింటిని పక్కనపెట్టి మా అభ్యర్థి సైదిరెడ్డిని 43 వేల మెజార్టీ పైచిలుకుతో గెలిపించారు. గతంలో అదే స్థానాన్ని మేము 7 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాం. ఇప్పుడు 50 శాతం ప్రజలు టీఆర్‌ఎస్ అభ్యర్థిని ఆశీర్వదించారు. హుజూర్‌నగర్ ప్రజలు ఏఏ ఆశలు, నమ్మకాలు పెట్టుకుని టీఆర్‌ఎస్‌ను గెలిపించారో వందశాతం వాళ్ల కోరికలు తీర్చుతామని సీఎం పేర్కొన్నారు.
Previous Post Next Post