గురువారం ఢిల్లీ కి సీఎం కేసీఆర్

హైదరాబాద్ అక్టోబర్ 2, (way2newstv.com):
గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారు. మధ్యాహ్నం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు. శుక్రవారం  ఉదయం 11.30 గంటలకు   ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతారు.  
గురువారం ఢిల్లీ కి సీఎం కేసీఆర్

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్స్,    కృష్ణా గోదావరి నదుల అనుసంధానం ప్రాజెక్ట్,  పెండింగ్ లో ఉన్న విభజన సమస్యలు,  కాళేశ్వరం జాతీయ హోదా,  బయ్యారం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు వంటి పెండింగు లో ఉన్న విభజన సమస్యలను చర్చిస్తారు. పది నెలల తరువాత మోడీ ని కేసీఆర్ కలుస్తున్నారు. ఎల్లుండి ఉదయం 11.30 గంటలకు  ప్రధాని మోదీతో ఆయన భేటీ కాబోతున్నారు.
Previous Post Next Post