అనంతపురం, అక్టోబరు 10, (way2newstv.com)
వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్నిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. వరల్డ్ సైట్ డే సందర్భంగా.. అనంతపురంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల చేతుల మీదుగా కంటి వెలుగు ప్రారంభమయ్యింది. మొత్తం ఆరు దశల్లో రాష్ట్రవ్యాప్తంగా పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కంటివెలుగు కార్యక్రమంలో నవంబర్ 1, డిసెంబర్ నెలాఖరు మధ్య సమగ్ర పరీ క్షలు నిర్వహించనున్నారు. ఉచితంగా శస్త్రచికిత్సలు, కళ్లజోళ్లు, ఇతర వైద్యసాయం అందిస్తారు.
ఏపీలో కంటి వెలుగు ప్రారంభం
రాష్ట్రంలో 5.4 కోట్ల మందికి దశలవారీగా కంటి పరీక్షలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అనంతపురం జూనియర్ కాలేజీ గ్రౌండ్స్లో ‘వైఎస్ఆర్ కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో 1.2 కోట్ల మందికి కంటి సమస్యలున్నాయన్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అందరికీ కంటి చికిత్సలు అందిస్తామన్నారు. తొలి విడతలో 70 లక్షల మంది స్కూల్ పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రెండో దశలో 400 బృందాలతో విద్యార్థులకు కంటి పరీ క్షలు నిర్వహిస్తామన్నారు. ఉచితంగా శస్త్ర చికిత్సలతో పాటు కళ్లజోళ్లు కూడా ఉచితంగా అందిస్తామన్నారు. రూ.560 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా కంటి చికిత్సలు నిర్వహిస్తామన్నారు. మూడు నుంచి ఆరు దశల్లో వృద్దులకు కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు పంపిణీ చేస్తామన్నారు.
Tags:
Andrapradeshnews