శ్రీనగర్, అక్టోబరు 10, (way2newstv.com)
ప్రకృతి ప్రేమికులకు ఇది శుభవార్త. జమ్మూకశ్మీర్‌కు ఇక టూరిస్టులు వెళ్లవచ్చు. రెండు నెలల నిషేధం తర్వాత జమ్మూకశ్మీర్ ప్రభుత్వం మళ్లీ పర్యాటకులను ఆహ్వానిస్తున్నది. ఆర్టికల్370 రద్దు నేపథ్యంలో కశ్మీర్ నుంచి పర్యాటకులను హుటాహుటిన వెళ్లగొట్టిన విషయం తెలిసిందే. అయితే పర్యాటకుల రాకపై ఉన్న నిషేధాన్ని ఉపసంహరిస్తున్నట్లు ప్రభుత్వంపేర్కొన్నది.
కశ్మీర్ లో తొలగిన ఆంక్షలు
కశ్మీర్ లోయకు వచ్చే ప్రతి యాత్రికుడికి కావాల్సిన సహాయాన్ని అందివ్వాల్సిందిగా ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది. ట్రావల్ అడ్వైజరీని ఎత్తివేయాలని కోరుతూ గవర్నర్ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు నెలలో ట్రావల్ అడ్వైజరీ అమల్లోకి వచ్చింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. కశ్మీర్‌కు ప్రధాన ఆర్థిక వనరుటూరిజం. అయితే యాత్రికులపై నిషేధం ఉన్న కారణంగా.. అక్కడ టూరిజం దెబ్బతిన్నది. గత జూన్‌లో సుమారు 1.74 లక్షల మంది టూరిస్టులు కశ్మీర్‌కు వచ్చారు. జూలైలో1.52 లక్షల మంది వెళ్లారు.
Tags:
all india news