హైదరాబాద్ అక్టోబర్ 04,(way2newstv.com):
బుర్గుల రామకృష్ణా రావు భవన్ లోని ఉద్యోగుల సౌకర్యం కోసం ఎస్బీఐ బ్రాంచిని నేటి నుండి ప్రారంభిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి తెలిపారు. శుక్రవారం బీఆర్కే ఆర్ భవన్ లో సి.యస్ ఎస్బీఐ బ్రాంచిని లాంచనంగా ప్రారంభించారు.
బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ఎస్బీఐ బ్యాంక్ సేవలు ప్రారంభించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
ఎస్బీఐ బ్రాంచిని ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలుపుతూ బ్రాంచిలో సౌకర్యాలు ఉద్యోగులకు ఎంతోఉపయోగకరంగా ఉంటాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్ మిశ్రా, అధర్ సిన్హా, చీఫ్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాశ్ మిశ్రా, జనరల్ మేనేజర్ వి. రమేష్ , డీజీఎం రవీంద్ర గౌరవ్, అసిస్టెంట్జనరల్ మేనేజర్ (సికింద్రాబాద్ బ్రాంచ్) ఎస్. సంధ్య తదితరులు పాల్గొన్నారు.
Tags:
telangananews