గవర్నర్‌ను కలిసిన సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు

విజయవాడ నవంబర్ 18 (way2newstv.com)
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతీరెడ్డి సోమవారం గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గంటకు పైగా విభిన్న అంశాలపై గవర్నర్‌, ముఖ్యమంత్రిల మధ్య చర్చలు జరిగాయి. తాజా రాజకీయ పరిస్థితులను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గవర్నర్‌కు వివరించారు. 
గవర్నర్‌ను కలిసిన సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు

అలాగే త్వరరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గవర్నర్‌కు తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రి దంపతుల గౌరవార్థం రాజ్‌భవన్‌ లంచ్‌ ఏర్పాటు చేసింది. గవర్నర్‌ ఇచ్చిన విందు స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దంపతులు రాజ్‌భవన్‌ నుంచి క్యాంప్‌ కార్యాలయానికి బయల్దేరి వెళ్లారు. అంతకు ముందు ముఖ్యమంత్రికి గవర్నర్‌ కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా, ఇతర అధికారులు స్వాగతం పలికారు.
Previous Post Next Post