నామినేటెడ్ పదవుల పందేరం షురూ...

విజయవాడ, డిసెంబర్ 5 (way2newstv.com)
ఏపీలో నామినేటెడ్ పదవుల నియామకాలకు ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జిల్లా స్థాయిలో కీలకమైన సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) , జిల్లా సహకార బ్యాంకు(డీసీసీబీ)ల చైర్మన్ పోస్టుల నియామకాలకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు డీసీఎంఎస్, డీసీసీబీ చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నామినేటెడ్ పదవుల నియామకాలతో వైసీపీలో జోష్ నిండింది.గత ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లు ఆశించి భంగపడిన కొంతమందికి జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టుల నియామకాల్లో ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ విజయం కోసం పని చేసిన కీలక నాయకులకు నామినేటెడ్ పదవులు కేటాయించినట్లు సమాచారం. 
నామినేటెడ్ పదవుల పందేరం షురూ...

ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి సీఎం జగన్ వెంట నడుస్తానని ప్రకటించిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రత్యర్థి, గన్నవరం వైసీపీ అభ్యర్థి వెంకట్రావుకు డీసీసీబీ చైర్మన్ పదవిని కేటాయించి సంతృప్తి పరిచే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. అలాగే ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్న రావి రామనాథం బాబు డీసీఎంఎస్ చైర్మన్‌గా నియమితులయ్యారు.శ్రీకాకుళం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్‌గా పిరియా సాయిరాజ్‌ నియమితులయ్యారు. శిరువూరు వెంకటరమణరాజు (విజయనగరం), ముక్కాల మహాలక్ష్మి నాయుడు (విశాఖపట్నం), దున్న జనార్దనరావు (తూర్పు గోదావరి), యడ్ల తాతాజీ (పశ్చిమ గోదావరి), ఉప్పాల రాంప్రసాద్‌ (కృష్ణా), కె.హెనీ క్రిస్టీనా (గుంటూరు), ఆర్‌.రామనాథం బాబు (ప్రకాశం), వి.చలపతిరావు (నెల్లూరు), దండు గోపి (కడప), పి.పి.నాగిరెడ్డి (కర్నూలు), పి.చంద్రశేఖర్‌రెడ్డి (అనంతపురం), సామకోటి సహదేవరెడ్డి (చిత్తూరు) నియమితులయ్యారు.శ్రీకాకుళం డీసీసీబీ చైర్మన్‌ పోస్టు పాలవలస విక్రాంత్‌‌ను వరించింది. మరిసర్ల తులసి (విజయనగరం), సుకుమార్ వర్మ (విశాఖపట్నం), అనంత ఉదయ్ భాస్కర్ (తూర్పుగోదావరి), కవురు శ్రీనివాస్ (పశ్చిమ గోదావరి), యార్లగడ్డ వెంకటరావు (కృష్ణా), రాతంశెట్టి సీతారామాంజనేయులు (గుంటూరు), మాదాసి వెంకయ్య (ప్రకాశం), ఆనం విజయ్ కుమార్ రెడ్డి (నెల్లూరు), ఎం.రెడ్డ మ్మ (చిత్తూరు), మాధవరం రామిరెడ్డి (కర్నూల్), తిరుపాల్ రెడ్డి (కడప), బోయ వీరాంజనేయులు (అనంతపురం)ను నియమించారు.
Previous Post Next Post