శనివారం విశాఖకు రానున్న సీఎం జగన్

విశాఖపట్నం డిసెంబర్ 27  (way2newstv.com)
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం నగర పర్యటనకు రానున్నారు. జీవీఎంసీ, వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్న రూ.1,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. సీఎం విజయవాడ నుంచి మధ్యాహ్నం 3.10 గంటలకు విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3.50 గంటలకు కైలాసగిరి మీదకు చేరుకుని వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. 
శనివారం విశాఖకు రానున్న సీఎం జగన్

అనంతరం అక్కడి నుంచి 4.40 గంటలకు సెంట్రల్ పార్కుకు చేరుకుని జీవీఎంసీ ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తరువాత సాయంత్రం 5.30 గంటలకు ఆర్కే బీచ్  కు  చేరుకుని విశాఖ ఉత్సవ్ను ప్రారంభిస్తారు. ఆరు గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి విజయవాడ వెళ్లిపోతారు
Previous Post Next Post