వరవరరావు అరెస్టును ఖండించిన జానా రెడ్డి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వరవరరావు అరెస్టును ఖండించిన జానా రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 29, (way2newstv.com)
విరసం వరవరరావు ని అరెస్ట్ చేయడని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎదో కుట్ర చేసాడనే  నెపం వేసి ఎలాంటి రుజువులు లేకుండా అరెస్ట్ చేయడం దారుణం. కేంద్ర ప్రభుత్వం దీని పై విచారణ జరిపించాలని సిఎల్పీ నేత జానారెడ్డి డిమాండ్ చేసారు. బుధవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. అవసరమైతే సుప్రీం కోర్టు  జడ్జి ని నియమించి విచారణ చెప్పటి నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలి. వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. రఫెల్ యుద్ధ విమాన కొనుగోలు రహస్య ఒప్పందం అని కేంద్ర ప్రభుత్వం  సమాధానం దాటేస్తుంది. రఫెల్  యుద్ధ విమానం పనులను రిలయన్స్ కంపెనీ కి ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి. రఫెల్ యుద్ధ విమానాల ధర దయడమే కుంభకోణం జరిగిందనే దానికి సంకేతమని అయన అన్నారు. నందమూరి హరికృష్ణ మృతి పట్ల ప్రగాడ సంతాపం వెలిబుచ్చారు. అసెంబ్లీ ఎందుకు రద్దు చేస్తున్నారో  చెప్పాలి. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల్లో పూర్తి స్థాయి వ్యతిరేక రాకముందే వెళ్ళాలని సర్కార్ ఆలోచిస్తున్నట్లు అర్ధమౌతుంది. ప్రభుత్వం డొల్లతనం బయటపడకముందే ప్రభుత్వం ముందస్తుకు వెళ్ళాలని భావిస్తుందని అయన అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన రాజకీయ పార్టీ లు సిద్దంగానే ఉంటాయమని జనారెడ్డి వ్యాఖ్యానించారు.
 
 
 
వరవరరావు అరెస్టును ఖండించిన జానా రెడ్డి