వైసీపీకి స్టార్ క్యాంపెయినర్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వైసీపీకి స్టార్ క్యాంపెయినర్లు

హైద్రాబాద్, ఫిబ్రవరి 18, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ వలసలు కూడా ఎక్కువైపోతున్నాయి. గత ఎన్నికల తర్వాత వలసల వల్ల బాగా ఇబ్బంది పడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు భిన్నమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. తెలుగుదేశం పార్టీ సహా మిగిలిన వాటి నుంచి వైసీపీలోకి జోరుగా చేరికలు జరుగుతున్నాయి. వీరిలో కొంత మంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం వస్తుండగా, మరికొందరని వైసీపీ నేతలే తీసుకొచ్చుకుంటున్నారు. ఇప్పుడిదే జాబితాలోకి మరొకరు చేరిపోయారు. దర్శకరత్న దాసరి నారాయణ రావు కుమారుడు అరుణ్ కుమార్ త్వరలో జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారట. ఈ విషయాన్ని ఆ పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొత్తగా నియమితులైన ప్రముఖ సినీ నటుడు పృథ్వీ రాజ్ వెల్లడించారు.బాబ్జీ వైసీపీకి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవిని జగన్ ఆదేశాల ప్రకారం పృథ్వీ రాజ్‌కు కేటాయించారు. 


వైసీపీకి  స్టార్ క్యాంపెయినర్లు

భానుచందర్, కృష్ణుడు, పోసాని కృష్ణ మురళి  దాసరి నారాయణ రావు గారి అబ్బాయి అరుణ్ ప్రచారం చేయనున్నట్లు సమాచారం. వీరితో పాటు చాలా మంది టీవీ కళకారులు, మహిళలను తీసుకుని ప్రతి గ్రామానికి వెళ్లాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దాసరి నారాయణ రావు చనిపోకముందు వైసీపీకి మద్దతుగా ఉండేవారు. దీనికి కారణం దాసరి కుటుంబానికి వైఎస్ఆర్ కుటుంబానికి మంచి సంబంధాలు ఉండడమే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాసరి నారాయణ రావు కేంద్ర మంత్రిగా పని చేశారు. అలాగే వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు దాసరి నారాయణ రావుతో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. వైఎస్ మరణానంతరం ఆయన తనయుడు, వైసీపీ అధినేత జగన్ సైతం దాసరి నారాయణరావుతో సన్నిహితంగా ఉండేవారు. 2016 జనవరి 6న దాసరి నారాయణ రావును వైఎస్ జగన్ కలిశారు. తనను ఆశీర్వదించాల్సిందిగా కోరడంతో పాటు తన పార్టీలోకి రావాలని కోరినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ లోపు ఆయన మరణించారు. దీంతో ఇప్పుడు అరుణ్ వైసీపీలో చేరబోతున్నారు.దాసరి సినీ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అరుణ్‌ కుమార్. చిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో విలన్‌గానూ నటించాడు. అయినా లాభం లేకపోయే సరికి సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇక దాసరి మరణం తర్వాత పూర్తిగా కనిపించకుండా పోయిన ఆయనను, ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి వైసీపీలో చేరాల్సిందిగా కోరారట. ఆ పార్టీలో చేరకున్నా జగన్‌ను గెలిపించే బాధ్యతను తీసుకున్న పోసాని.. సినీ పరిశ్రమలోని చాలా మందిని వైసీపీలో చేర్చారు. ఇందులో భాగంగానే అరుణ్‌ను కూడా ఆయనే ఒప్పించారని సమాచారం. అయితే, అరుణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరని, ఆయనకు పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించబోతున్నారని తెలుస్తోంది.