కరీంనగర్ ఏప్రిల్ 5 (way2newstv.com):
రైతును ఆదుకున్న ప్రభుత్వం..తెలంగాణ ప్రభుత్వమని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఈటల మాట్లాడుతూ..నూటికి 70 శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నరని అన్నారు. రైతుకు పంట పెట్టుబడి సాయం అందిస్తున్నం.
రైతు వ్యాపారవేత్త కాదు..త్యాగమూర్తి: మంత్రి ఈటల
రైతు వ్యాపారవేత్త కాదు..త్యాగమూర్తి అని ఈటల చెప్పారు. వచ్చే వర్షాకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో మిడ్ మానేరును నింపుతం. కరీంనగర్ జిల్లా వాటర్ జంక్షన్‌గా మారబోతుందని, ఎస్సారెస్పీ కాలువల్లో365 రోజులు నీళ్లు పారుతయని ఈటల వెల్లడించారు. ఎస్సారెస్పీ నీటితో చెరువులు నింపుతమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నరని ఈటల మండిపడ్డారు.