శ్రీ మఠంలో అక్షయ తృతీయ వేడుకలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

శ్రీ మఠంలో అక్షయ తృతీయ వేడుకలు

బృందావనానికి చందనలేపనం         
మంత్రాలయం మే 7 (way2newstv.cm
పవిత్ర పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతులు ఆధ్వర్యంలో అక్షయ తృతీయ వేడుకలను అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి మరియు పూర్వ పీఠాధిపతుల బృందావనాలకు నిర్మాల్యం పంచామృత అభిషేకం గావించి చందన లేపనంతో విశేష అలంకరణ నిర్వహించారు.   


శ్రీ మఠంలో అక్షయ తృతీయ వేడుకలు

**శ్రీమఠంలో భక్తుల సందడి. వేసవి సెలవులు పురస్కరించుకొని 
శ్రీ మఠంలో భక్తుల సందడి. నెలకొంది. మంత్రాలయం చేరుకున్న భక్తులు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకున్నారు. రాఘవేంద్రస్వామి బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పీఠాధిపతులు భక్తులకు ఫల మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు.*