డెంగ్యూ నివారణకు అందరు కృషి చేయాలి

జిల్లా  వైద్యారొగ్య  అధికారి డా.ప్రమోద్ కుమార్
పెద్దపల్లి  ,మే 16   (way2newstv.com)
డెంగ్యూ వ్యాధి  నివారణకు అందరం కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా వైద్యారొగ్య అధికారి డా.ప్రమాద్ కుమార్  అన్నారు.  జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం పురస్కరించుకొని   గురువారం కలెక్టరేట్  కార్యాలయం నుండి  జిల్లా వైద్యారొగ్య అధికారి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ  ర్యాలీని   జిల్లా వైద్యారొగ్య అధికారి డా.ప్రమాద్ కుమార్ జేండా ఊపి ప్రారంభించారు.  


డెంగ్యూ నివారణకు అందరు కృషి చేయాలి  

ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ   డెంగ్యూ వ్యాధి ఎడిఎస్ ఈ జిప్టు దోమ కుట్టడం వల్ల వస్తుందని,  ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి అని,  సరైన సమయంలో గుర్తించి చికిత్స చేసకోనట్లయితే  50 మందిలో ఒకరు మరణించే అవకాశం ఉంటుందని  ఆయన   తెలిపారు.  తీవ్రమైన జ్వరం, శరీరం  పై దద్దుర్లు,   చర్మం ద్వారా రక్తస్రావం, తీవ్రమైన తలనొప్పి, కండరాళ్లు, కీళనొప్పులు డెంగ్యూ వ్యాధి లక్షణాలని, దోమలు వ్యాపించకుండా ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహిస్తున్నామని, ఆశా  కార్యకర్తలు మరియు ఆరొగ్య సిబ్బంది వీటి పై గ్రామాలోని ప్రజలకు అవగాహన   కల్పించాలని,  గత సంవత్సరం జిల్లాలో 285 డెంగ్యూ కేసులు వచ్చాయని, ముఖ్యంగా మంథని, ముత్తారం, గర్రెపల్లి, శ్రీరాంపూర్ ప్రాంతాల వద్ద అధిక మందికి డెంగ్యూ వ్యాధి సోకిందని  తెలిపారు. ప్రోగ్రాం అధికారి బాలయ్య, డిప్యూటి డిఈఎంఒ ఫణీంద్ర, వైద్యఅధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు ఈ  కార్యక్రమంలో  పాల్గోన్నారు.
Previous Post Next Post