గ్రంధాలయాలే దేవాలయాలు..! - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గ్రంధాలయాలే దేవాలయాలు..!


కాంగ్రెస్ నేత వీర్లపల్లి శంకర్ 
చించొడ్ ప్రజా గ్రంధాలయానికి రూ.20వేల విలువైన పుస్తకాల వితరణ 
షాద్ నగర్ మే 27, (way2newstv.com)
సమాజంలో  గ్రంథాలయాలే  దేవాలయాలని  గ్రంధాలయం సేవలను వినియోగించుకుంటే బాల బాలికలు ప్రయోజకులు అవుతారనీ నేడు గ్రంధాలయాలు గ్రామ గ్రామాన వెలుస్తుండటం శుభ పరిణామమని షాద్ నగర్  కాంగ్రెస్ నేత వీర్లపల్లి శంకర్ అన్నారు.  సోమవారం  ఫరూక్ నగర్ మండలం చించొడ్ గ్రామంలో  ఏర్పాటు చేసిన ప్రజా గ్రంథాలయానికి 20 వేల రూపాయల విలువైన  పుస్తకాలను వితరణ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బాలమని దామోదర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీర్లపల్లి శంకర్ మాట్లాడారు. గ్రామాల్లో గ్రంథాలయాల అభివృద్ధికి గ్రామ యువత విశేష కృషి చేస్తుందని ఇది మంచి శుభ పరిణామమని అన్నారు. 


గ్రంధాలయాలే దేవాలయాలు..!

ఒకప్పుడు గ్రామాల్లో చదువు కోవడానికి పుస్తకాలు, దినపత్రికలు దొరికేవి కాదని కానీ నేడు గ్రామాల్లో గ్రంథాలయాలు ప్రజల చెంతకు వచ్చాయని వాటి సేవలను ప్రజలు, విద్యార్థులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఆనాటి రోజుల్లో ఇలాంటి సేవలు  లేకపోవడంతో చదువు లేక, ఆర్థిక పరిస్థితులు బాగ లేక దరిద్రం అనుభవించిన రోజులు ఉన్నాయని, తాను కూడా కూలీనాలీ చేసుకుని జీవించిన పరిస్థితులు ఉన్నాయంటూ వీర్లపల్లి శంకర్ గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ప్రస్తుత కాలంలో విద్యార్థులకు గ్రామాల్లో చదువులతోపాటు విజ్ఞానాన్ని పెంపొందించే గ్రంధాలయాలు అందుబాటులోకి రావడం చేత వారు తమ మేధస్సుకు పదును పెట్టి మంచి ఫలితాలు రాబట్టాలని 
గొప్ప గొప్ప చదువులు డిగ్రీలను పొందాలని అన్నారు. ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్న ఒక డిగ్రీ కిందికి లెక్క కావని, ప్రతి ఒక్కరు బాగా చదివి డిగ్రీలు సంపాదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పండుగ బాలమని దామోదర్, డిప్యూటీ సర్పంచ్ ర్యాకల శ్రీనివాస్, స్పోకెన్ ఇంగ్లీష్ టీచర్ నర్సింహ చారి, మాజి డిప్యూటీ సర్పంచ్ రాజు, వార్డ్ సభ్యులు అజ్మత్ బాబా అలీ,జయప్రసాద్,గ్రామ పెద్దలు దామోదర్,శ్రీధర్ రెడ్డి, బాలరాజ్,సర్దార్,యాదగిరి,గౌస్ ఖాన్,రాజు గ్రామ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.