మారని ఫార్టీ ఇయర్ ఇండస్ట్రీ వైఖరి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మారని ఫార్టీ ఇయర్ ఇండస్ట్రీ వైఖరి


విజయవాడ, జూన్ 7, (way2newstv.com)
హుందాతనం గురించి ప్రతీ రోజు తెగ లెక్చర్లు దంచే టీడీపీ వల్లభుని లోగిలి ఇపుడు ఓటమి భారం తట్టుకోలేకపోతోంది. హుందాగా దేనిని అయినా స్వీకరించాలన్న ఆలోచన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు ఎందుకో కలగడంలేదు సరే వందిమాగధులు ఎటూ ఉన్నారు. కింద పడ్డా మనదే పై చేయి అని చెప్పే వారికి కొదవే లేదు. మరి ఇది సరిపోతుందా. ఇదేనా క్యాడర్ కి ఇవ్వాల్సిన దిశానిర్దేశం.మనం ఓడిపోలేదు, వాళ్ళు గెలవలేదు, కేవలం ఈవీఎం మిషన్లే గెలిపించాయి. గత పది రోజులుగా పసుపు శిబిరంలో వినిపిస్తున్న మాట ఇదే. వచ్చిన ఫలితాలు మరీ ఘోరంగా ఉండడంతో డైజెస్ట్ చేసుకోవడం కష్టంగానే ఉంటుంది మరి. అంత మాత్రం చేత ఎన్నికలను, ఈవీఎంలను ఆడిపోసుకోవడమేనా. ఇవే ఈవీఎం లు కాదా 2014లో టీడీపీని గెలిపించినది. మరి ఆనాడు లేని బాధ ఇపుడు ఎందుకొచ్చిందో. 


మారని ఫార్టీ ఇయర్ ఇండస్ట్రీ వైఖరి
గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలుకోకపోబట్టే భారీ ఓటమి ఎదురైంది. కాల్ మనీ రాకెట్ విషయంలో చూస్తూ వూరుకోవడం వల్ల కృష్ణా జిల్లాలో టీడీపీ మట్టికొట్టుకుపోయింది. పేద రైతుల భూములతో రియల్ దందా చేయడం వల్ల గుంటూరు కారం తినిపించారు. రైతులకు రుణ మాఫీ మోసాలు, కాపులకు రిజర్వేషన్ వేషాలు గోదావరిలో ముంచేశాయి.వివక్ష, పట్టించుకోకపవడం, వెనకబడిన జిల్లాలను కనీసంగా కూడా దగ్గరకు తీయకపోవడం వల్ల ఉత్తరాంధ్ర ఉత్త చేయి ఇచ్చేసింది. సీమ జిల్లాలకు శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం రావాల్సినవి ఇవ్వకుండా కనీసం హై కోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేయకుండా చేసిన అన్యాయం కదా రాయలసీమ సైకిల్ తలరాతను మార్చేసింది. వీటికి తోడు, చింతమనేని వంటి వారి దాష్టికాలు, జన్మభూమి కమిటీల దౌర్జన్యాలు, విచ్చలవిడిగా అవినీతి, ఏక పక్ష పాలన, ఆ రెండు జిల్లాలు, ఆ ఒక్క కులం అన్న తీరున సాగించిన నిరంకుశ పాలన వల్ల కళ్లు దిమ్మ తిరిగే తీర్పును జనం ఇచ్చారు. మరి ఇవన్నీ గుర్తు తెచ్చుకుని దారికో పడాల్సింది పోయి మేమేం తప్పు చేయలేదు, జనమే తప్పుగా తీర్పు చెప్పారనడం ఏ పెద్దమనిషితనం. ఉండవల్లిలో చంద్రబాబు ఓదార్పులో మనం ఓడిపోలేదు అంటున్నారు టీడీపీ అధినాయకుడు.అదే నిజం అంటున్నారు వందిమాగధులు. పేపెర్ బ్యాలెట్ పెట్టండి గెలిచేస్తామని కూడా అంటున్నారు. మరి పేపెర్ బ్యాలెట్ గా ఉన్న పోస్టల్ బ్యాలెట్ కూడా టీడీపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఓట్లు వేసిన సంగతి ఎందుకు మరచిపోతున్నారో. ఏది ఏమైనా గెలుపు కు కారణాలు ఉండవు కానీ ఓటమికి సవాలక్ష ఉంటాయి. వాటిని పట్టుకుని, పట్టించుకుని తప్పుని సరిదిద్దుకుంటే టీడీపీకి మళ్ళీ ఫ్యూచర్ ఉంటుంది. అంతే తప్ప మేము ఓడిపోలేదు అంటూ పిట్ట కధలు చెప్పుకుంటే ఇంతే సంగతులు అన్నది మరువరాదంటున్నారు నిజమైన కార్యకర్తలు.