జీవకోటి మనుగడ ప్రకృతి.. పర్యావరణం పై ఆధారపడి ఉంది. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జీవకోటి మనుగడ ప్రకృతి.. పర్యావరణం పై ఆధారపడి ఉంది.


సహజ వనరుల పరిరక్షణ ఉద్యమంల చేపట్టాలి...
- ప్రకృతి ని నిర్లక్ష్యం చేస్తే..మన  మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది...
- ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి..చెట్లను పెంచాలి..అడవులను సంరక్షించాలి.. ప్లాస్టిక్ ని నివారించాలి...
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చిన  మాజీ మంత్రి ,ఎమ్మెల్యే హరిశ్ రావు 
సిద్దిపేట,  జూన్ 5 (way2newstv.com)
 ఈ  భూమండలం లో అన్నింటి కంటే విలువైనది ప్రకృతి , జీవ కోటి మనుగడ ప్రకృతి, పర్యవరణం పై ఆధారపడి ఉంది అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు అన్నారు.. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట  కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు  లేక పోతే మానవ మనుగడనే ప్రశ్నార్ధకం అవుతుంది అని... అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నో ప్రకృతి పై దృష్టి పెడుతున్నాయని  ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి, మొక్కలను సంరక్షించాలి అని చెప్పారు..


జీవకోటి మనుగడ ప్రకృతి.. పర్యావరణం పై ఆధారపడి ఉంది.
ప్రకృతి సంరక్షణ మన అందరి బాధ్యత... 130 కోట్ల జనాభా కలిగిన మన భారతదేశం చెట్లను నాటి కాపాడు కోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నదన్నారు ...  సహజ వనరుల పరిరక్షణ ఉద్యమంల చేపట్టాలి... చెట్లను నాటడం వాటిని సంరక్షించడం  ఉద్యమ తరహాలో చేపట్టాలని సూచించారు. కాలుష్యం బాగా పెరిగి కొత్త కొత్త వ్యాధులు,క్యాన్సర్ లాంటి  వ్యాధుల బారిన పడుతున్నామన్నారు.. చెట్లను పెంచడం..అడవులను సంరక్షించడం.. ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలన్నారు..ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలని..ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో కూడా ప్రకృతి , పర్యావరణ పై బోధించాలని ప్రతి ఒక్క విద్యార్థి తో మొక్క నాటించాలని చెప్పారు.. ఈ సందర్భంగా సిద్దిపేట బార్ అసోసియేషన్ సభ్యులతో మొక్క నాటించి సంరక్షించాలని..కోర్టు ప్రాంగణం అం