సిటీలో బేకారవుతున్న ట్రాఫికర్... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సిటీలో బేకారవుతున్న ట్రాఫికర్...


హైద్రాబాద్, జూలై 5, (way2newstv.com)
మహానగరంలో రోజురోజుకీ వాహనాల పార్కింగ్‌ సమ స్య గుదిబండలా మారుతోంది. కారో, ద్విచక్రవా హనమో పార్కింగ్‌ చేయాలంటే అష్ట కష్టాలు పడుతు న్నారు. రానున్న రోజుల్లో గ్రేటర్‌ పరిధిలో పార్కింగ్‌ సమస్య తీవ్రతరం కానుంది. నగరంలో దాదాపు 80 శాతం వ్యాపార సము దాయల్లో పార్కింగ్‌ స్థలాలు లేవు. గ్రేటర్‌లో కొత్త వాహనాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో వాహనాలను ఎక్కడ పార్కింగ్‌ చేయాలన్న సమస్య తలెత్తుతోంది. కొత్త వాహనాల సంగతి దేవుడెరుగు... ఉన్న వాహనాలను పార్కింగ్‌ చేసేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. హైద్రాబాద్ నగరంలో ఇంటి నుంచి బండి బయటికి తీయాలంటే ట్రాఫిక్‌కో, సేఫ్‌ జర్నీకో బయపడే వారు. కానీ నేడు నగరంలో పరిస్థితి మారింది. బండితో బయటికొస్తే పార్కింగ్‌ ఫీజు దోపిడీతో వాహనదారులు వణు కుతున్నారు. అది ఆస్పత్రైనా... వ్యాపార సముదా యమైనా... పార్కింగ్‌ ఫీజు దోపిడీ మాత్రం మాములే. అధికారుల నిర్లక్ష్యానికి తోడు ట్రాఫిక్‌ పోలీసుల ధాటికి వాహనదారుల జేబులు గుల్లవుతున్నాయి. 

సిటీలో బేకారవుతున్న ట్రాఫికర్...


రోడ్డు వెంట పార్క్‌ చేస్తే పోలీసులు చలానా విధిస్తున్నారు. పోనీ పార్కింగ్‌ స్థలంలో చెద్దామంటే పార్కింగ్‌ ఫీజు పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారు. నగరంలో 2021 నాటికి ఎనిమిది వేల ఎక రాల స్థలం పార్కింగ్‌ అవసరమని ఓ సర్వే నిర్ధారించింది. 2001లో ప్రతి వెయ్యి మందికీ 103 వాహ నాలు ఉండగా, 2011లో వెయ్యి మందికి 279 వాహ నాలున్నాయి. 2021లో ప్రతి వెయ్యి మందికి 500 వాహానాలు ఉండనున్నాయి. అంటే ప్రతీ ఇద్దరిలో ఒకరికి వాహనం ఉంటుందన్న మాట. పార్కింగ్‌ దందా సాగుతోందిలానగరంలో పార్కింగ్‌ మాఫియా చెలరేగుతో ంది. ఎక్కడ వాహనం ఆపినా.. పార్కింగ్‌ ఫీజు అంటూ దోచేస్తున్నారు. పర్మిట్‌ పార్కింగ్‌ స్థలాలు ఉన్నవి కొన్ని మాత్రమే. అయితే పెయిడ్‌ పార్కింగ్‌ పేరుతో వసూళ్ల దందా మాత్రం జోరుగా కొనసాగుతోంది. వివిధ పనులపై బయటికెళ్లే వాహనదారుల జేబులకు నిత్యం చిల్లు పడుతోంది. ఎక్కడ బండి ఆపినా పార్కింగ్‌ కోసం డబ్బు చెల్లించాల్సి వస్తోంది. వీకెండ్‌లో సినిమాలకు, వ్యాపార సము దాయాలకు వెళుతున్న వారిని పార్కింగ్‌ ఫీజు పరేషా న్‌ చేస్తుంది. నగరంలో పాగా వేసిన పార్కింగ్‌ మాఫియా ఏటా వాహనా దారుల నుంచి రూ.వందల కోట్లు వసూలు చేస్తోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. పనుల మీద బయటి కొచ్చేవారు రోజులో కనీసం నాలుగైదు చోట్ల బండిని ఆపాల్సి వస్తోంది. కనీసం పది నిమిషాలు ఆపినా రోజూ రూ. 50 వరకు కట్టాల్సిందే. ఇలా నెలలో కనీసం రూ. వెయ్యి నుంచి రూ.1500 దాకా చెల్లించాల్సి వస్తోంది. సిటీలో పార్కింగ్‌ దందా మూడు కార్లు ఆరు బైకులు అన్న చందంగా నడుస్తోంది. నగరంలో ఉండే అనేక పార్కింగ్‌ సెంటర్లు రోడ్ల మీదనే ఉన్నాయి. హోటళ్లు, దుకాణాలు, వ్యాపార సముదాయాలు, పాఠ శాలలు, కాలేజీలు, ప్రయివేటు, ప్రభుత్వ ఆస్పత్రులు పార్కింగ్‌కు అడ్డాగా మారు తున్నాయి. అసలు వీటి వద్ద ప్రయివేటుగా పార్కింగ్‌ ఫీజు వసూలు చేయొద్దు. కానీ ఇక్కడ పార్కింగ్‌ మాఫియా రెచ్చిపోతుంది. ఐదు నిమిషాలు ఆపినా ద్విచక్రవాహానినికైతే రూ.5, కార్లయితే రూ.10 ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. దీంతో వాహనాదారులు రోడ్లపైనే ఆపు తున్నారు. రోడ్లపై పార్కింగ్‌ చేస్తే మరో సమస్య. ట్రాఫిక్‌ పోలీసులు ఫొటో తీసి మరీ చలాన్లు వేస్తున్నారు. లేకుంటే వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలి స్తున్నారు. నిబంధనల ప్రకారం పార్కింగ్‌ స్థలం లేకుంటే వ్యాపారానికి అనుమతివ్వొద్దు. కానీ ఈ నిబంధన ఎక్కడా అమలవుతు న్నా దాఖాలాల్లేవు. పార్కింగ్‌ ప్రాంతాలను ఎంపిక చేయాల్సిన జీహెచ్‌ఎం సీ, ట్రాఫిక్‌ పోలీసుల మధ్య సమన్వయం కొరవడడం పార్కింగ్‌ మాఫియాకు వరంగా మారింది. ప్రయివేటు స్థలాల్లో ఈ సమస్య మరింత ఘోరంగా తయా రైంది. ప్రయి వేటు సంస్థలు, మల్టీపెక్స్‌లు, కమర్షియల్‌ కాంపెక్ల్‌ల్లో పార్కింగ్‌ ఫీజు వసూలుకు అడ్డూ అదుపు లేదు. నగరంలో వేల సంఖ్యలో ఉన్న ప్రయివేటు సంస్థల్లో పార్కింగ్‌ విషయం లో ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నాయి. నగరంలో ఏటా పా ర్కింగ్‌ ఫీజు రూ.135 నుంచి రూ.160 కోట్ల వరకు ప్రజల జేబుల్లోంచి వెళ్తోంది. కమర్షియల్‌ కాంప్లెక్స్‌ వెళ్లాలంటే రూ.30 నుంచి రూ.60 వసూలు చేస్తున్నారు. మరికొన్ని చో ట్ల రూ.100 వరకు వసూలు చేస్తున్నారు. లేకుంటే వాహనా న్ని బయటపెట్టుకొమ్మని నిర్మొహమాటంగా చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ పార్కింగ్‌ లాట్లను ఏర్పాటు చేసినా పెద్దగా ఫలితం లేదు. అబ్సిడ్‌లోని జీపీఓ, చార్మినార్‌లో మదీనా సమీపంలో జీహెచ్‌ఎం సీ మల్టీలెవల్‌ పార్కింగ్‌ను ఏర్పాటు చేసింది. ఇలాంటి పార్కింగ్‌ స్థలాలను నగరంలో చాలాచోట్ల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రయివేటు, వాణిజ్య సంస్థలు ఇషా ్టరాజ్యంగా వ్యవహరిస్తూ రోడ్ల వెంట ఉండే స్థలాలనుఆక్రమించుకుంటున్నారు. కొన్నిచోట్ల పుట్‌పాత్‌లను కలిపేసుకుంటున్నారు. ఇలాంటి వారి పై కఠిన చర్యలు తీసుకోవాల్సిన జీహె చ్‌ఎంసీ తనకేం సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తోంది. జీహెచ్‌ఎంసీ పర్మిషన్‌ ఇచ్చిన పార్కింగ్‌ స్థలాలు నగరంలో కేవలం 53 మాత్రమే.. కోఠి, అబ్సిడ్‌, 
అమీర్‌పేట్‌, మైత్రివనం, హిమా యాత్‌ నగర్‌, ప్యాట్నీ, బేగంపేట్‌, నాంపల్లి, సికింద్రాబాద్‌, ప్యారడైజ్‌ ప్రాంతాల్లో పార్కింగ్‌ ఫీజు వసూలు చేస్తున్న తీరు దారుణం. అధికారికంగా అనుతిచ్చిన 53 పార్కింగ్‌ లాట్ల వేలం ద్వారా జీహెచ్‌ఎంసీకి వచ్చే ఆదాయం కేవలం రూ.3 కోట్లు. కానీ రోడ్లపై జరుగుతున్న పార్కింగ్‌ దందా ఏటా రూ.60 కోట్లపైనే ఉంటుందని అంచనా. పార్కింగ్‌ సమస్యలపై ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో సర్వేలు చేయించింది. కానీ వాటిని అమలు చేయట్లేదు. దీంతో చిన్న సమస్య కాస్త పెద్దదైంది. ఇప్పటికైనా ఉన్న పార్కింగ్‌ స్థలాలను రెగ్యులరైజ్‌ చేస్తే ఇప్పటికైనా సమస్య తగ్గే అవకాశం ఉంది.