చంద్రబాబుకు ఇతర పార్టీల్లో ఫ్యాన్స్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చంద్రబాబుకు ఇతర పార్టీల్లో ఫ్యాన్స్

విశాఖపట్టణం, ఆగస్టు 21, (way2newstv.com
చంద్రబాబు రాజకీయాల్లో తలపండినవారు. ఆయన చుట్టూ వైఫేలా అన్ని పార్టీలు తిరుగుతుంటాయి. ప్రతి పార్టీలో జరుగుతున్న విషయాలన్నీ చంద్రబాబుకి ఎప్పటికపుడు తెలుస్తూంటాయి. చంద్రబాబు విషయంలో ఓ మాట కూడా ప్రచారంలో ఉంది. ఆయన తన పార్టీని చక్కదిద్దుకుంటూనే ఇతర పార్టీలలో జరుగుతున్న వ్యవహారాలను ఎప్పటికపుడు ఓ కంట కనిపెడుతుంటారని అంటారు. ఇదిలా ఉండగా చంద్రబాబుకు అన్ని పార్టీలో అభిమానులు ఉన్నారు. వైసీపీలో కూడా ఉన్నా తప్పులేదు. ఇక కొన్ని పార్టీల్లో అయితే భక్తులు కూడా ఉన్నారు. సొంత పార్టీలో భజన చేసే వారు ఉన్నారంటే అర్ధం చేసుకోవచ్చు కానీ ఇతర పార్టీలో కూడా బాబు గారి భజనమేళం ఉందంటేనే ఆయన ఎంతటి గండరగండడో అర్ధం చేసుకోవచ్చు. చంద్రబాబుకు ఇపుడు బీజేపీలో భక్తులు ఒక్కసారిగా పెరిగిపోతున్నారు. వారందరికీ బాబు అంటే అదో రకం ఇది మరి.
చంద్రబాబుకు ఇతర పార్టీల్లో ఫ్యాన్స్

విశాఖకు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన 2014లో ఎమ్మెల్యేగా నెగ్గారు. అప్పట్లో బీజేపీ తరఫున గెలిచిన నలుగురిలో ఇద్దరు పొత్తులో భాగంగా మంత్రులు అయ్యారు. మిగిలిన ఇద్దరిలో రాజు గారు శాసనసభాపక్ష నాయకుడు అయ్యారు. దాంతో ఆయన‌కు చంద్రబాబుతో బాగా చనువు ఏర్పడింది. అసెంబ్లీని వైసీపీ చివరి రెండేళ్ళు బాయ్ కాట్ చేయడంతో రాజు గారికి అది బాగా కలసివచ్చింది. ఆయన బాబుని ఏకంగా అసెంబ్లీలోనే పొగుడుతూ సొంత పార్టీ వారు సైతం షాక్ తినేలా వ్యవహరించిన సందర్భాలు అనేకం. చంద్రబాబుని సినీనటుడు శోభన్ బాబుతో పోల్చి అందగాడు మా చంద్రబాబు అని సంతృప్తి పడింది ఇదే రాజు గారు. కేంద్రాన్ని తిడుతూ చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం పెడితే మద్దతు ఇచ్చింది కూడా ఈయనే. అన్నిటికీ మించి ఎన్నికలు అయిపోయాక ఢిల్లీ ఆంద్రాభవన్లో చంద్రబాబు ఎదురుపడితే రాజు గారు సంతోషాన్ని, అభిమానాన్ని అసలు ఆపుకోలేకపోయారు. మీరే మళ్ళీ సీఎం కావాలి అంటూ భజన అక్కడ కూడా మొదలెట్టేసారు. మరి ఇంతటి చంద్రబాబు ఫ్యాన్ అయిన రాజు గారికి జగన్ సీఎం అయితే సహజంగా ఇబ్బందిగానే ఉంటుందేమో. అందుకే ఆయన జగన్ పాలన అసలు బాలేదనేస్తున్నారు. అంతటితో ఆగకుండా తాను సీఎం అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వరా అంటూ గుస్సా అయ్యారు. జగన్ కంటే మా చంద్రబాబబే నయం అంటూ మళ్ళీ కీర్తనలు అందుకున్నారు. ఎపుడు పడితే అపుడు గత సీఎం చంద్రబాబు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారంటూ గొప్పలు పోయారు. మొత్తానికి రాజు గారు బీజేపీలో ఉన్నా ఎందుకో చంద్రబాబుని తలవకుండా ఉండలేకపోతున్నారు.ఇక నిన్నటి వరకూ చంద్రబాబుకు కుడిభుజంగా ఉన్న సుజనాచౌదరి లాంటి వారు అసలైన బాబు భక్తులన్నది అందరికీ తెలిసిందే. చంద్రబాబుని ఒక్క మాట అనను, ఎందుకంటే ఆయన నా రాజకీయ గురువు అని సుజనా బీజేపీలో చేరినపుడే చెప్పుకున్నారు. ఇక నిన్నటి ఏపీ బీజేపీ అధ్యక్షుడుకు హరిబాబు చంద్రబాబు గారంటే అదొక రకం అభిమానం. ఆయన తన పదవీకాలంలో ఎపుడూ చంద్రబాబుని పల్లెత్తుమాట అని ఎరగరు. ఇక బీజేపీ సీనియర్ నేత ఎడ్లపాటి రఘునాధబాబు వంటి వారికి కూడా చంద్రబాబు ఇష్టుడే మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబు భక్తులంతా బీజేపీలో ఉన్నారు. బీజేపీ ఏమో కేంద్రంలో అధికారంలో ఉంది. ఇక చంద్రబాబుకు చేతిలో పవర్ లేకపోయినా వచ్చిన లోటేమిటి.