సైరా ... స్టార్టైంది... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సైరా ... స్టార్టైంది...

హైద్రాబాద్, ఆగస్టు 21, (way2newstv.com)
రామ్ చరణ్ నిర్మాతగా.. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో మెగా స్టార్ చిరు హీరోగా ఐదు భషాల్లో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి ప్రభంజనం మొదలైపోయింది. మొన్న మేకింగ్ వీడియో తో దుమ్మురేపిన సైరా యూనిట్ నేడు సైరా టీజర్ ని ముంబై లో విడుదల చేసింది. అక్టోబర్ 2 న విడుదలకబోతున్న సైరా నరసింహ రెడ్డి ప్రమోషన్స్ ముంబై వేదికగా గ్రాండ్ గా మొదలైపోయాయి. సైరా సినిమాని రామ్ చరణ్ 250 కోట్లతో భారీగా నిర్మిస్తున్నాడు. మెగా స్టార్ చిరు కెరీర్ లోనే సైరా అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. అందుకే యావత్ దేశం మొత్తం సైరా సినిమా పై ఆసక్తి చూపడం, చారిత్రాత్మక చిత్రం కావడం తో సినిమా మీద భారీగా అంచనా ఉన్నాయి. 
సైరా ... స్టార్టైంది...

ఇక సైరా టీజర్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా ఈ సినిమాపై క్రేజ్ పెరగడానికి కారణం.మరి సైరా టీజర్ చూశాక ఆ అంచనాలు అందుకోవడం సైరా కు పెద్ద విషయం కాదనిపిస్తుంది. అంతలా ఉంది సైరా టీజర్. పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో పవర్ ఫుల్ గా మొదలైన టీజర్ లో చిరు లుక్స్ హైలెట్. చిరు ఉయ్యాలవాడ లుక్ లో గతంలోనే పోస్టర్స్ తో అదరగొట్టాడు. ఇప్పుడు ఎంతో ఎనర్జిటిక్ హీరోగా సైరా నరసింహారెడ్డి లుక్ లో, యాక్షన్ సీక్వెన్సెస్ లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఇక సైరా యుద్ధ సన్నివేశాలు సినిమాకి హైలెట్ గా నిలవనున్నాయి. ఇక ఈ సినిమాలో నటిస్తున్న నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్, అమితాబ్, జగపతి బాబు లుక్స్ కూడా కేక పుట్టించేయిలా ఉన్నాయి. అందరూ పవర్ ఫుల్ పాత్రలకు అడ్రస్ గా కనబడుతున్నారు. సైరా నరసింహారెడ్డి ఆంగ్లేయుల భరతం పట్టిన మహా వీరుడిగా.. చరిత్ర లో కలిసిపోయిన వాడిలా చిరు నటన, లుక్స్, ఎనేర్జి లెవెల్స్ అన్నిటా అద్భుతం గా కనిపిస్తున్నాయి. మేకింగ్ వీడియో కన్నా సై రా టీజర్ లోనే స్టార్స్ యొక్క పాత్రలకు ఓ క్లారిటీ కనబడుతుంది. ఇక సినిమాకి పెట్టిన బడ్జెట్ తెర మీద నిండుగా కనబడుతుంది. కోటలు, యుద్ధ సన్నివేశాలు, భారీ నిర్మాణాల సెట్టింగ్స్ అన్ని భారీగా కనబడమే కాదు…. ఏనాడో మరుగున అపడిపోయిన చరిత్రని గుర్తు చేస్తున్నాయి.ఇక చిరు ఎంతో పవర్ ఫుల్ గా గర్జించిన…. రేనాటి వీరులారా…చరిత్రలో మనం ఉండకపోవచ్చు. కానీ చరిత్ర ఈరోజు మనతోనే మొదలవ్వాలి.. అనే డైలాగ్ అయితే మెగా ఫాన్స్ కి