విజయవాడ సెప్టెంబర్ 17 (way2newstv.com)
రాష్ట్రంలో అక్టోబర్ 10నుండి 15 వరకు క్రొత్తగా ప్రవేశపెడుతున్న డాక్టర్. వై ఓస్ ఆర్, కంటి వెలుగు కార్యక్రమం అమలుకు ఏ పి సీఎం వై స్ జగన్మోహన్ రెడ్డి 5 వందల 30కోట్లు కేటాయించినట్లు ఏ పి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. సిద్దార్థ మెడికల్ కాలేజీలో మంగళవారం జరిగిన డాక్టర్ వై స్ ర్, కంటి వెలుగు రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ కార్యక్రమంలో ఏ పి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
కంటి వెలుగు కార్యక్రమానికి 30 కోట్లు
ఈ సందర్బంగా అయిన మాట్లాడుతు, రాష్ట్రము లో అరవైరెండు వేల ప్రభుత్వ పాఠశాలలో 70లక్షలు మంది పిల్లలుకు ఈ కార్యక్రమం అమలు చేస్తామని చెప్పారు... చిన్న.. పెద్ద తేడా లేకుండా ఈ పధకం అమలు చేయలని ప్రణాళిక రూపొందిస్తున్నట్టు ఆళ్ల నాని చెప్పారు. మానవశరీరంలో కళ్ళు చాలా ప్రధానమని,,, సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో బాగస్వాములు కావాలని ఆళ్ల నాని విజ్ఞప్తి చేశారు.