అమరావతి సెప్టెంబర్ 26, (way2newstv.com)
పర్యావరణ, అటవీశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ. సమీక్షా సమావేశానికి మంత్రి బాలినేని, ముఖ్య అటవీశాఖ అధికారులుహాజరయ్యారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ పరిశ్రమల కాలుష్యాన్ని తొలగించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. ఆమేరకు గ్రీన్ ట్యాక్స్ వుంటుంది. పర్యావరణ విధ్వంసాన్నిసహించేది లేదని అన్నారు. ప్రస్తుతం ఉన్న కాలుష్య నియంత్రణ బోర్డు, సంబంధిత వ్యవస్థల్లో ప్రక్షాళన జరగాలి. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో దేశానికి మార్గదర్శకంగారాష్ట్రం వుండాలని అన్నారు. నెల రోజుల్లోగా పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై అత్యుత్తమ విధానాలపై ప్రతిపాదనలు, ఆమేరకు అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెడతామని అన్నారు.
పర్యావరణ, ఆటవీ శాఖలపై సీఎం జగన్ సమీక్ష
గోదావరి జిల్లాల్లో పంటకాల్వల పరిరక్షణకు మిషన్ గోదావరి, ఇ– వేస్ట్ కోసం... కాల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామన్నారు. లక్ష టన్నుల వ్యర్థాలు ఫార్మా కంపెనీ నుంచి వస్తే అందులోసుమారు 30శాతం మాత్రమే శుద్దిచేస్తున్నారు. మిగతా 70శాతం వాతావరణంలోకి వదిలేస్తున్నారన్న సమాచారం నాకు వచ్చింది. హేచరీ జోన్గా ప్రకటించిన ప్రాంతాల్లో..ఫార్మాకంపెనీలకు అనుమతి ఇచ్చారు. ఇవాళ ఏపీ నుంచి పెద్ద ఉత్తున సముద్రపు ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి, మనం దేశంలోనే నంబర్ వన్ అని అన్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు హేచరీ జోన్గా ప్రకటించిన తర్వాత ఆ ప్రాంతాల్లో ఫార్మాకంపెనీలకు ఎలా అనుమతి ఇచ్చారో అర్థంకావడం లేదు. ఫార్మా కంపెనీల కోసం ఇప్పటికే మనం ఫార్మాసిటీలనుఏర్పాటుచేశాం. అక్కడే వాటిని పెట్టుకునేలా వారికి అనుతులు ఇచ్చి ఉండాల్సిందని అన్నారు. పరిశ్రమలు ఏమైనా వస్తున్నాయంటే.. రెడ్కార్పెట్ వేస్తాం, కాని, వాటినుంచి ఎలాంటికాలుష్యం వస్తుందనే దానిపై మనం ఆలోచన చేయం. వాతావరణానికి, పర్యావరణానికి ఎలాంటి భంగం కలుగుతుందనే దానిపై దృష్టిపెట్టడం లేదని సీఎం అన్నారు. ఎన్నివేల కోట్లపెట్టుబడులు వస్తున్నాయని మాత్రమే ఆలోచిస్తాం. ప్రస్తుతం ఉన్న కాలుష్య నియంత్రణ బోర్డు, సంబంధిత వ్యవస్థల్లో ప్రక్షాళన జరగాలి. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ పట్లసమగ్ర అవగాహన, పరిజ్ఞానం, అంకిత భావం ఉన్నవారు ఈ వ్యవస్థల్లో ఉండాలి. అలాగే పరిశ్రమలు నడుపుతున్నవారికి కూడా వేధింపులకు గురవుతున్నామనే భావనరానీయకూడదని జగన్ అన్నారు. ఈ అంశాలన్నింటినీ సమగ్రంగా ఆలోచించి. ఉత్తమ విధానాలను మనం అనుసరించాలి. పరిశ్రమల కాలుష్యాన్ని తొలగించే బాధ్యతను ప్రభుత్వంతీసుకుంటుందని అన్నారు. మన పర్యావరణాన్ని, ప్రకృతిని సంరక్షించుకోకపోతే మన తర్వాత తరాలు ఎలా బతక గలుగుతాయి. ఈ ఆలోచనలు చేయ కపోతే.. చాలా ఇబ్బందులువస్తాయి. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో మనం దేశానికి మార్గదర్శకంగా నిలవాలని ముఖ్యమంత్రి సూచించారు. అటవీశాఖ వద్ద ఉన్న ఎర్ర చందనాన్ని ఏకమొత్తంగా అమ్మేపద్దతులు కాకుండా విడతలుగా అమ్మితే ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. వాల్యూ యాడ్ చేసి అమ్మితే ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. ఈ విషయంలో అంతర్జాతీయ సంస్థలసహకారం తీసుకుంటే మేలు జరుగుతుంది, చైనా, జపాన్ సంస్థలతో చర్చలు జరపండని అయన ఆదేశంచారు.