సిటీలో 3 వేల బైక్ రైడర్ల ట్యాక్సీలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సిటీలో 3 వేల బైక్ రైడర్ల ట్యాక్సీలు

హైద్రాబాద్, అక్టోబరు 10, (way2newstv.com)
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే… వారి ఇబ్బందే మరికొందరికీ ఉపాధిగా మారింది.  సిటీలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ఆటోలు, క్యాబ్ ధరలు పెంచడంతో  బైక్ రైడర్ల సేవలను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. మెట్రో, ఎంఎంటీఎస్ ఉన్నా వినియోగం, ప్రయాణించే మార్గం పరిమితంగా ఉంది. సిటీలో ఏడాది కాలంగా బైక్ ట్యాక్సీలు అందుబాటులోకి రాగా, ఇదే మంచి ఆదాయ వనరుగా మారింది. ప్రస్తుతం సిటీలో దాదాపు 3 వేల మంది బైక్ రైడర్లు ట్యాక్సీ సేవలు అందిస్తుండగా,  ఆర్టీసీ కార్మికుల సమ్మెతో వీరికి గిరాకీ పెరిగింది.
సిటీలో 3 వేల బైక్ రైడర్ల ట్యాక్సీలు

ప్రస్తుతం ఓలా, ఉబెర్, రాపిడో వంటి యాప్ బేస్డ్ బైక్ ట్యాక్సీ సర్వీసులు ఉన్నాయి. వీటిని వినియోగించే వారి సంఖ్య రోజుకురోజుకు పెరుగుతోంది.  వీటిని సింగిల్ గా గమ్యస్థానాలకువెళ్లేవారు అధికంగా ఉపయోగిస్తున్నారు. ప్రతి కి.మీలకు రూ. 2 –8 మధ్య ఖర్చుతో సేవలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో సిటీలో అధికంగానే వినియోగించుకుంటున్నారు.  డ్రైవింగ్ లైసెన్స్, సొంత బైక్ ఉన్న యూత్‌‌ ఉపాధి పొందుతున్నారు. అదనపు ఆదాయం, పాకెట్ మనీ సంపాదించుకునే వెసులుబాటు ఉండటంతో బైక్ రైడర్లుగా మారారు.  పెట్రోలు, భోజనం ఖర్చులు పోను రోజు 300 – 600 వరకు సంపాదిస్తున్నారు. ఆర్టీసీ సమ్మె కారణంగా బైక్ ట్యాక్సీలకు బుకింగ్స్ పెరిగాయి. రెండు రోజులుగా గిరాకీ బాగా వస్తుందని పలువురు బైక్ రైడర్లు చెబుతున్నారు.ఓలా, ఉబర్, రాపిడో, గెట్ మీ, వోగో, డ్రైవ్ ఈజీ వంటి బైక్ ట్యాక్సీ సేవలను అందించే సంస్థలున్నాయి. వీటిల్లో డ్రైవింగ్ లైసెన్స్, ఇతర సర్టిఫికెట్లను పరిశీలించిన తర్వాత రైడర్ గా లేదా, బైక్ ను అద్దె రూపంలో ట్యాక్సీగా  అవకాశం కల్పిస్తారు. రోజులో మూడు షిప్టుల వారీగా విభజించి, రైడ్ చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తారు. ఉదయం 9 నుంచి అర్ధరాత్రి 12గంటల దాకా వీలైన సందర్భంలో బైక్ రైడ్ చేసే అవకాశం ఉంది.