ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా ‘అది ఒక ఇదిలే’ ట్రైలర్ రిలీజ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా ‘అది ఒక ఇదిలే’ ట్రైలర్ రిలీజ్

850 సినిమాలకు డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసిన సీనియర్ మోస్ట్ కొరియోగ్రాఫర్ స్వర్ణ మాస్టర్ దర్శకురాలిగా మారారు. ఇన్నేళ్ల తన అనుభవంతో మెగాఫోన్ పట్టుకుని తొలిసారిగా ఓక్యూట్ లవ్ స్టోరీతో వస్తున్నారు. యూత్ ఫుల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తోన్న సినిమా ఇది. అందరూ కొత్తవాళ్లే నటించిన ఈ సినిమా ట్రైలర్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుగారి చేతులమీదుగా విడుదల చేశారు.ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ .. ‘‘850సినిమాలకు డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసిన స్వర్ణ మాస్టర్ డైరెక్ట్ చేసిన అది ఒక ఇదిలే ట్రైలర్ నాచేతుల మీదుగా విడుదల చేయడం ఆనందంగా ఉంది. ట్రైలర్ బావుంది. ట్రైలర్ చూస్తే ఓ క్యూట్ లవ్ స్టోరీలా కనిపిస్తోంది.ఓ ఫ్లాట్ లో ఉండే యువత మధ్య జరిగే ప్రేమకథగా నాకుఅర్థమైంది. 
ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా  ‘అది ఒక ఇదిలే’ ట్రైలర్ రిలీజ్

ఈ సినిమా పెద్ద విజయం సాధించి టీమ్ మొత్తానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్’’ అన్నారు..హీరో సవ్యసాచి మాట్లాడుతూ ‘‘ ఈ సినిమా జర్నీ అంతా నా లైఫ్ లో ఓ డ్రీమ్ లాగా జరిగింది. అంత పెద్ద టెక్నీషియన్ ఫస్ట్ మూవీలో నటించే అవకాశం రావడం అదృష్టం. స్టోరీసెషన్, వర్క్ షాప్స్ అన్నీ కలిపి నాకో లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ లా ఉంది. ఇంత పెద్ద సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా మీ అందరికీ ఖచ్చితంగానచ్చుతుందీ సినిమా. కొత్తవాళ్లమే అయినా మంచి టీమ్ మీ ముందుకు వస్తోంది. ఇక దిల్ రాజుగారి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశాము.. ఆయనకు మా ట్రైలర్ బాగానచ్చింది. ఇది మాకు ఇంకా కాన్ఫిడెన్స్ ను ఇచ్చింది.. మీ అందరి ఆశిస్సులు మాకు కావాలి..’’అన్నాడు..హీరోయిన్ రాధికా ప్రీతి మాట్లాడుతూ .. ‘‘స్వర్ణ మేడమ్ గురించి నాకు అంతకు ముందు పెద్దగా తెలియదు. కానీ నాకు కథ తెలిసి ఆడిషన్ కు వెళ్లాను. మేడమ్ నన్ను సెలెక్ట్చేశారు. మా అందరికీ ఈ మూవీ మంచి లైఫ్ ఇస్తుంది. మా టీమ్ అందరికీ మీ ఆశిస్సులు కావాలి’’ అని చెప్పింది.అది ఒక ఇదిలే సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసిన మహీ మాట్లాడుతూ .. ‘‘అది ఒక ఇదిలే దిల్ రాజు గారి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కావడం సంతోషాన్నిచ్చింది. ఓ మంచిప్రాజెక్ట్ తో మీ ముందుకు వస్తున్నాం.. మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి..’’ అన్నాడు.