జ్వరాలున్నాయ్... మందుల్లేవ్.. (మహబూబ్ నగర్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జ్వరాలున్నాయ్... మందుల్లేవ్.. (మహబూబ్ నగర్)

మహబూబ్ నగర్, నవంబర్ 04 (way2newstv.com): 
జిల్లాలో పెద్ద మొత్తంలో జ్వరాలు.. డెంగీ కేసులు నమోదవుతున్నాయి.. ఎందుకు ఇంతలా కేసులు వస్తున్నాయో అధికారులు గుర్తించాలి.. ప్రతిరోజు నిద్ర లేకుండా రోగులను చూడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రక్తదాతల కొరత ఇబ్బంది పెడుతోంది. డెంగీ కేసులు ఎక్కువవడంతో వారికి ప్లేట్‌లెట్లు, సాధారణ రక్తం ఎక్కించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎవరైనా సాధారణంగా మూడు నెలలకోసారి రక్తదానం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే నెగిటివ్‌ గ్రూప్‌లు ఉన్న చాలామంది రక్తదానం చేశారు. ఇలాంటి గ్రూప్‌లు ఉన్న వారి రక్తం, ప్లేట్‌లెట్ల కోసం హైదరాబాద్‌ నుంచి కూడా జిల్లాను సంప్రదిస్తున్నారు. ఇటీవల కాలంలో పాజిటివ్‌ రక్త గ్రూప్‌లు ఉన్న దాతల కోసం కూడా వెతకాల్సి రావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. 
జ్వరాలున్నాయ్... మందుల్లేవ్.. (మహబూబ్ నగర్)

ఎవరిని సంప్రదించినా పదిహేను రోజులు, నెల రోజుల క్రితం ఇచ్చామని, మళ్లీ రెండు నెలలు ఆగాలని సమాధానం ఇస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా సంప్రదించినా దొరకని పరిస్థితి నెలకొంది. రోజురోజుకు డెంగీ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.. జ్వరాలు, డెంగీ, విరేచనాలతో ఆస్పత్రులకు వచ్చే బాధితుల సంఖ్య అధికంగా ఉంది.. సాధారణంగా డెంగీ సీజన్‌ సెప్టెంబరుతో పూర్తి కావాల్సి ఉన్నా ఇంకా కొనసాగుతూనే ఉంది.. ప్లేట్‌లెట్లు విపరీతంగా పడిపోతుండటంతో ఎక్కువగా సమస్య వస్తోంది. ప్లేట్‌లెట్లు ఇచ్చేందుకు దాతల కొరత ఏర్పడింది.. మరోవైపు జ్వర బాధితులు  పెరుగుతుండటంతో ఒక్కోసారి ప్రైవేటు మెడికల్‌ దుకాణాల్లోనూ మందుల లేమి కనిపిస్తోంది.సాధారణంగా అనారోగ్య సమస్యలు వస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత ఉంటుందని ఇప్పటి వరకు చూశాం. కాని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోని మందుల షాపులు, బయట ప్రైవేట్‌ మెడికల్‌ దుకాణాల్లో సైతం ఇటీవల కాలంలో కొరత కనిపిస్తోంది. యాంటీబయాటిక్‌ ఇంజెక్షన్లతోపాటు కొన్ని మాత్రలు అసలు దొరకడం లేదు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్‌ల లభ్యత కూడా తక్కువగా ఉంది. గతంలో ఇంత పెద్ద డెంగీ సీజన్‌ తాము చూడలేదని, పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో మార్కెట్‌లో డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో కంపెనీలు సైతం మందులు సరఫరా చేసేందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నాయని ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సైతం కొన్ని మందుల కొరత ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా డెంగీ బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిపై ప్రభావం అధికంగా పడుతుంది. ఇక మహబూబ్‌నగర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అయితే వైద్యుల అపాయింట్‌మెంట్‌, పడకల కోసం సిఫార్సులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మారుమూల ప్రాంతాలైన అచ్చంపేట, కొల్లాపూర్‌, నారాయణపేట తదితర నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాల నుంచి అయితే డెంగీ అని తెలిసిన వెంటనే మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. వైద్యుల అపాయింట్‌మెంట్‌ కోసం ఒకరోజు, ఆస్పత్రిలో చేరాలంటే పడకలు లేక ఒకటి, రెండు రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.వైపు ఇంకా వెళ్లలేదు. త్వరలోనే తన సొంత జిల్లా చిత్తూరుకు వెళ్లాలనుకుంటున్నారు. అయితే కడప జిల్లాలో చంద్రబాబు సమీక్షలు చేయకముందే పార్టీ నేతలు కొందరు బయటకు వెళ్లిపోతున్నట్లు చెప్పేస్తుండటం విశేషం.కడప జిల్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా. మొన్నటి ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. జీరో రిజల్ట్ రావడంతో ఇక్కడ టీడీపీ నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. టీడీపీ ఓటమి పాలు కాగానే రాజ్యసభ సభ్యుడు, చంద్రబాబుకు అత్యంత ఆప్తుడు సీఎం రమేష్ బీజేపీలోకి జంప్ చేశారు. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగానే సీఎం రమేష్ జారుకున్నారు. ఇక తాజాగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కూడా తాను బీజేపీలోకి జంప్ అవుతున్నట్లు ముందుగానే చంద్రబాబును కలసి చెప్పారు. జగన్ నుంచి తనను తాను కాపాడుకోవడానికే బీజేపీలోకి వెళుతున్నట్లు చంద్రబాబుతో ఆదినారాయణరెడ్డి చెప్పారుఇక కడప జిల్లాకు చెందిన మరికొందరు నేతలు సయితం బీజేపీ బాట పడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చెలాయించిన వారు పార్టీకి మొహం చాటేస్తున్నారు. ఎన్నికలకు ముందే బద్వేలు ఎమ్మెల్యే జయరాములు టీడీపీని వీడి బీజేపీలో చేరారు. అలాగే కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి సయితం త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కడప నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా ఉన్న ఆరిఫుల్లా కూడా బీజేపీలో చేరారు. మరికొందరు నేతలు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటిస్తున్నారు. చంద్రబాబు కడప జిల్లాలో సమీక్ష నిర్వహించకముందే టీడీపీ నేతలు పార్టీని వీడుతున్నట్లు ప్రకటిస్తుండటం పసుపు పార్టీలో ఆందోళన రేకెత్తిస్తుంది.