ఫిబ్రవరి 15 నుంచి టెన్త్, ఇంటర్ పరీక్షలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఫిబ్రవరి 15 నుంచి టెన్త్, ఇంటర్ పరీక్షలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 18  (way2newstv.com)
సీబీఎస్‌ఈ పదోతరగతి, ఇంటర్ (10, 12 తరగతుల) పరీక్షల షెడ్యూలును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూలును అందుబాటులో ఉంచింది. షెడ్యూలు ప్రకారం ఒకేషనల్ సబ్జెక్టుల పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 20 వరకు 10వ తరగతి పరీక్షలు, ఫిబ్రవరి 15 నుంచి మార్చి 30 వరకు 12వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 15 నుంచి పదోతరగతి, 12వ తరగతి ఒకేషనల్ పరీక్షలు ప్రారంభం కానుండగా.. ఫిబ్రవరి 26 నుంచి పదోతరగతి ప్రధాన పరీక్షలు, ఫిబ్రవరి 22 నుంచి 12వ తరగతి ప్రధాన పరీక్షలు ప్రారంభంకానున్నాయి.
ఫిబ్రవరి 15 నుంచి టెన్త్, ఇంటర్ పరీక్షలు

సీబీఎస్‌ఈ బోర్డు ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం మే మొదటి వారంలో పరీక్షల ఫలితాలను వెల్లడించనున్నారు. పరీక్షలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. విద్యార్థుల రూల్ నెంబర్లు లేదా హాల్‌టికెట్లను సంబంధిత పాఠశాలలకు బోర్డు పంపనుంది. ప్రైవేట్‌గా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.సీబీఎస్‌ఈ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ఈ ఏడాది 32 లక్షల డిజిటల్ లాకర్లను అందుబాటులో ఉంచనున్నారు. ఫలితాలు విడుదలయ్యాక విద్యార్థులు తమ మార్కు షీట్లను, మైగ్రేషన్ సర్టిఫికేట్లు, పాస్ సర్టిఫికేట్లను డిజిటల్ లాకర్ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ఈసారి 10వ తరగతి విద్యార్థులకు రెండు మ్యాథమెటిక్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. స్టాండర్డ్ మ్యాథ్స్ ఎగ్జామ్, బేసిక్ మ్యాథ్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు తమకు నచ్చిన పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించారు.