విజయవాడ, డిసెంబర్ 18, (way2newstv.com):
ఆధునాతన సాంకేతిక పరిజ్ఙానాన్ని వినియోగించుకొని పిడుగుపాటు పై ముందుగానే ప్రజలలో అవహన కలిగించి అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణ ఆస్తి నష్టాలను చాలా వరకు తగ్గించవచ్చునని రాష్ట్ర ల్యాండ్ రెవెన్యూ విపత్తుల శాఖ కార్యదర్శి వి.ఉషారాణి అన్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ శాఖ యునిసెఫ్ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ నిర్వహింస్తున్న పిడుగుపాటు ముందస్తు సూచనలు అవగాహనపై విజయవాడలో నిర్వహిస్తున్న రెండురోజుల జాతీయ సదస్సును బుధవారం రాష్ట్ర ల్యాండ్ రెవెన్యూ విపత్తుల శాఖ కార్యదర్శి వి.ఉషారాణి జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. అనంతరం ఉషారాణి మాట్లాడుతూ అధునాతన సాంకేతిక పరిజ్ఙానాన్ని వినియోగించుకొని పిడుగులుపడే అవకాశమున్న ప్రాంతాలను ముందుగానే అంచనావేసి ప్రజలను అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణ ఆస్తి నష్టాలను చాలా వరకు తగ్గించవచ్చునని అన్నారు.
పిడుగుపాటుపై ముందస్తు అవగాహన
మనదేశంలో గడచిన పది సంవత్సరాలలో 25 వేల మంది పిడుగుపాటు వంటి విపత్తుల కారణంగా చనిపోయారన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని రైతులు కూలీలు పశువుల కాపరుల వంటి వారు పిడుగుపాటు పై సరైన అవగాహనలేక వర్షంపడే సమయంలో చెట్లక్రిందకు వెళ్ళడం కారణంగా ఎక్కవగా చనిపోతున్నారన్నారు. మన రాష్ట్రంలో గత మూడు సంవత్సరాల నుండి పిడుగులుపడే అవకాశమున్నచోట తెలుగు ఇగ్లీషు భాషల్లో ప్రజలకు సంక్షిప్త సందేశాలు పంపుతూ మండల స్థాయిలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. పిడుగులు పడే అవకాశమున్న ప్రదేశం పై ముందుగానే అంచనాకు రావడం, ఆవెంటనే ప్రభుత్వ విభాగాలు స్పందించి ప్రజలను అప్రమత్తం చేయడం ముఖ్యమని, ఆసమయంలో పాటించవలసిన ముందు జాగ్రత్త చర్యల పై బుక్ లెట్లు రూపొందించి పంపీణీ చేయడం ద్వారా ప్రాణ ఆస్తి నష్టాలను చాలా వరకు తగ్గించగలుగుతామన్నారు. పిడుగుపాటుపై అంచనా ముందస్తు సూచనలు అవగాహన కలిగించడం వంటివాటిలో దేశంలోని వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను ఈ సదస్సులో చర్చించడం జరుగుతుందన్నారు. ప్రకృతి విపత్తులపై ఇప్పటికే మాక్ డ్రిల్స్ వర్కుషాపులు నిర్వహించడం జరిగిందని, పిడుగు పాటుపై పరిశోధనలు జరిపిన వివిధ సంస్ధల శాస్త్రవేత్తల తమ పరిశోధనాంశాలను, సాంకేతిక పరిజ్ఙానాన్ని వినియోగించుకొని ప్రజలలో అవగాహన కలిగించడం ముందుగానే వారిని అప్రమత్తం చేయడం వంటి అంశాలపై చర్చిస్తారని తెలిపారు. కార్యక్రమంలో విపత్తుల నిర్వహణ శాఖా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, రిటైర్డు సైంటిస్టు ఎం.ఎం.ఆలీ, శాస్త్రవేత్తలు స్టెల్లా శామ్యూల్, డాక్టర్.అమిత్ కెస్కర్, విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, యునిసెఫ్ జాతీయ విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు వివిధ రాష్ట్రాల విపత్తుల నిర్వహణ శాఖల అధికారులు ప్రతినిధులు పాల్గొన్నారు.