బాబు ఒంటరి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బాబు ఒంటరి

విజయవాడ, డిసెంబర్ 27, (way2newstv.com)
టీడీపీ అధినేత చంద్రబాబు ఒంటరి అవుతున్నారు. దాదాపుగా ఆరు నెలలుగా ఆయన ఒక్కరే పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి తర్వాత పార్టీలో సీనియర్ నేతలందరూ సైడయిపోయారు. చంద్రబాబు మాత్రం జిల్లాల సమీక్షలు చేస్తూ క్యాడర్ లో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చింది. ఒకరకంగా ఇది చంద్రబాబుకు అగ్ని పరీక్ష వంటిదే. ఈ సమయంలో అధినేతకు అండగా నిలవాల్సిిన అవసరం ఎంతైనా ఉంది.కానీ సీనియర్ నేతలు ఎవరూ చంద్రబాబుకు అండగా నిలిచింది లేదు. ప్రధానంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు మూడు రాజధానుల ప్రతిపాదనపై మౌనం వహిస్తున్నారు. తాజాగా చంద్రబాబు అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ నిర్ణయం తీసుకున్నా దానిని సమర్థిస్తూ ఎవరూ మాట్లాడటం లేదు. 
బాబు ఒంటరి

కేవలం కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ నేతలు మాత్రం చంద్రబాబు వెంట ఉంటున్నారు.మరోవైపు టాలీవుడ్ లో కూడా చంద్రబాబుకు అండ దొరకడం లేదు. ఇప్పటికే చిరంజీవి మూడు రాజధానుల ప్రతిపాదనకు ఓకే చెప్పారు. మద్దతిచ్చారు. ఒకప్పుడు టాలీవుడ్ మొత్తం టీడీపీకి అండగా ఉండేది. టాలీవుడ్ లో నటులు, దర్శక, నిర్మాతలందరూ ఎక్కువగా కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వారే అయినా అమరావతికి మద్దతుగా నిలిచేందుకు ముందుకు రాలేదు. చివరకు చంద్రబాబు వియ్యంకుడు, సినీనటుడు బాలకృష్ణ సయితం అమరావతిపై స్పందించడం లేదు.దీనికి తోడు టీడీపీ లోని కీలక నేతలు కూడా ఈ విషయంలో సైడయిపోవాలని చూస్తున్నారు. విశాఖలో నలుగురు ఎమ్మెల్యేలు ఉంటే గంటా శ్రీనివాసరావు తప్ప ఎవరూ నోరు మెదపలేదు. గంటా విశాఖకు రాజధాని రావాల్సిందేనంటున్నా మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు మౌనంగానే ఉన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నేతలు సయితం చంద్రబాబు అమరావతిలోనే రాజధాని ఉండాలన్న ప్రకటనను సన్నిహితుల వద్ద తప్పుపడుతున్నట్లు తెలిసింది. మొత్తం మీద కీలక సమయంలో చంద్రబాబుకు తోడుగా ఎవరూ నిలవకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది..మరో వైపుపారిశ్రామిక వేత్తలు, రాజ‌కీయాల్లో వార‌సులుగా ఎదిగిన వారు కొంద‌రు… రాజ‌కీయాల‌ను అడ్డు పెట్టుకుని వ్యాపారాలు సాగిస్తున్నవారు మ‌రికొంద‌రు.. వారంద‌రికీ ఏకైక నాయ‌కుడు చంద్రబాబు. ప‌దేళ్లపాటు ప్రతిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో వారంతా ఆయ‌న‌కు అండ‌గా నిలిచారు. ఈ క్రమంలోనే చంద్రబాబు చేసిన వ‌స్తున్నా మీకోసం.. వంటి యాత్రల‌కు విరివిగా ధ‌నాన్ని ఇచ్చారు. ఆ త‌ర్వాత 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో వ్యూహాత్మకంగా ఖ‌ర్చు చేశారు. టీడీపీ గెలిచి, నిలిచేలా వారంతా తెర‌చాటు ప్రయ‌త్నాలు చేశారు. మొత్తానికి వారంతా క‌లిసి చంద్రబాబును నాడు ముఖ్యమంత్రిని చేయగలిగారు.దీంతో వారికి ఏదైనా చేయాల‌ని చంద్రబాబు తాము ఇన్నాళ్లు ఎంతో చేశాం.. మాకు ప్రతిఫ‌లం కావాల‌ని వారు ప‌ర‌స్పరం ఓ అండ‌ర్ స్టాండింగ్‌కు వ‌చ్చారు. ఈక్రమంలోనే అమ‌రావ‌తిలో భూముల క్రయ‌విక్రయాలు, సీఆర్డీఏ ప‌రిధి మార్చడం వంటివి జ‌రిగాయ‌ని, ఫ‌లితంగా చంద్రబాబు బంధువులు, పార్టీ నాయ‌కులు, వారి బంధువులు భారీ ఎత్తున ల‌బ్ధి పొందార‌ని వైసీపీ నేత‌ల ఆరోప‌ణ‌. ఇదే విష‌యాన్ని సాక్షాత్తూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రశ్నించారు. దీంతో ఇప్పుడు రాజ‌ధాని అంశం.. సెంట‌రాఫ్‌ది టాపిక్ గా మారిపోయింది. ఈ ప‌రిణామం రాజ‌కీయంగా ఒక‌ప‌క్క టీడీపీకి ఇబ్బంది క‌లిగిస్తే.. ఇప్పుడు చంద్రబాబు రిలేష‌న్స్ విష‌యంలోనూ దెబ్బకొట్టే ప్రమాదం ఉంద‌ని అంటున్నారు.నిజ‌మే నాడు.. త‌న‌కు సాయం చేసిన వారికి చంద్రబాబు కూడా సాయం చేయొచ్చు. ఈ విష‌యంలో ఎవ రూ త‌ప్పుప‌ట్టరు. అయితే, ఆ చేసేదేదో ఎవ‌రికీ దొర‌క‌కుండా , పూర్తి న్యాయ వివాద ర‌హితంగా త‌మ‌కు చేసి ఉంటే.. నేడు జ‌గ‌న్ ప్రభుత్వం వేసే ప్రశ్నల‌కు, చేసే బెదిరింపుల‌కు తాము భయ‌ప‌డాల్సిన అవస‌రం ఉండ‌దు క‌దా అనేది చంద్రబాబు మిత్రుల‌, ఆయ‌న సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌ల మాట‌. రాజ‌ధాని పై జ‌గ‌న్ ప్రక‌ట‌న త‌ర్వాత టీడీపీలో ఇదే విష‌యంపై భారీ ఎత్తున చ‌ర్చ సాగింది. దీంతో తొలిరెండు రోజులు ఒకింత మౌనంగా ఉన్న చంద్రబాబు.. సోమ‌వారం మాత్రం తీవ్ర యుద్దానికి రెడీ అయ్యారు.ఈ క్రమంలోనే ఆయ‌న అమ‌రావ‌తిని ద‌ళితుల రాజ‌ధానిగా పేర్కొంటూ కొత్త నినాదాన్ని అందుకున్నారు. అదే స‌మ‌యంలో తాడికొండ నియోజ‌క‌వ‌ర్గాన్ని కూడా తెర‌మీదికి తెస్తున్నారు. అయితే, ఈ ప్రయ‌త్నం ఏమేర‌కు ఫ‌లిస్తుంద‌నేది ఇప్పుడు ప్రధాన చ‌ర్చ. నాడు ద‌ళిత రైతుల‌ను బెదిరించి పొలాలు లాక్కున్నా రంటూ.. వ‌చ్చిన వ్యాఖ్యల‌పై చంద్రబాబు స్పందించ‌లేదు. అదే స‌మ‌యంలో ఇప్పటి వ‌ర‌కు గ‌డిచిన ఐదేళ్లలో ఏనాడూ చంద్రబాబు ద‌ళిత రాజ‌ధాని అనే మాట‌ల‌ను కూడా తెర‌మీదికి తీసుకురాలేదు. పైగా ద‌ళిత రైతుల‌కు కేటాయించిన ప్లాట్లు ఓ మూల‌గా ఉన్నాయ‌ని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులే గ‌తంలో వెల్లడించారు. మ‌రిఇలాంటి విష‌యాల‌కు చంద్రబాబు ఇప్పుడు స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే చంద్రబాబు చేస్తున్న ఈ ప్రయ‌త్నం స‌క్సెస్ అయ్యే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు.