వ్యవసాయ విద్య, పరిశోధనలు క్షేత్రస్థాయికి విస్తరింపజేయాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వ్యవసాయ విద్య, పరిశోధనలు క్షేత్రస్థాయికి విస్తరింపజేయాలి

రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌
హైదరాబాద్‌ జనవరి 7  (way2newstv.com)
వ్యవసాయంలో మానవ వనరుల కొరత ఉంది. వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణ సేవలు క్షేత్రస్థాయికి విస్తరింపజేయాలి. వ్యవసాయ విద్య, పరిశోధనలు బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు గవర్నర్‌. పరిశోధన ఆధారంగా పరిశ్రమల స్థాపన జరగాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ సూచించారు. రాజేంద్రనగర్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలో అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌లో 110వ ఫౌండేషన్‌ కోర్సును రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ప్రారంభించారు. 
వ్యవసాయ విద్య, పరిశోధనలు క్షేత్రస్థాయికి విస్తరింపజేయాలి

వ్యవసాయ పరిశోధన సేవల 2 నెలల శిక్షణకు 25 రాష్ర్టాల నుంచి 135 యువ శాస్త్రవేత్తలు హాజరయ్యారు.ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. పాల ఎగుమతుల్లో భారత్‌ అగ్రగామిగా ఉంది అని తెలిపారు. దేశంలో పెద్ద ఎత్తున మొబైల్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సాగుతుందన్నారు. అమెరికాలోని కొన్ని కంపెనీలు పశువుల్లో కృత్రిమ గర్భధారణ చేస్తున్నాయి. ప్రతి రాష్ట్రం, ప్రాంతంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులున్నాయని తమిళిసై తెలిపారు. రెండో హరిత విప్లవం దిశగా యువ శాస్త్రవేత్తలు కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. రైతుల ఆదాయాలు రెట్టింపు కోసం ప్రతి శాస్త్రవేత్త కృషి చేయాలి. వ్యవసాయ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. మానసిక ఒత్తిళ్లు అధిగమించేందుకు యోగా శిక్షణ అలవరుచుకోవాలి అని గవర్నర్‌ సూచించారు.