ఆగస్టు 27న తిరుప తి కోదండరామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణం

తిరుపతి(way2newstv.com)
టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో ఆగస్టు 27వ తేదీ మంగళవారం శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రంను పురస్కరించుకుని శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా జరుగనుంది. 
ఆగస్టు 27న తిరుప తి కోదండరామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణం

ఈ సందర్భంగా ఉదయం 11.00 గంటలకు శ్రీసీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం, అక్కడే ఊంజల్సేవ నిర్వహిస్తారు.
Previous Post Next Post