రివర్స్ టెండరింగ్ పై హైకోర్టు బ్రేక్

అమరావతి ఆగష్టు 22 (way2newstv.com
పొలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. రివర్స్ టెండరింగ్ పై ముందుకు వెళ్లొద్దంటూ ఏపీ హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు  జారీ చేసింది. నవయుగ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై  హైకోర్ట్  ఈ నిర్ణయించింది. అంతేగాక పోలవరం కాంట్రాక్ట్ నుంచి నవయుగని తప్పించే అంశంపైనా స్టే ఇచ్చింది. 
రివర్స్ టెండరింగ్ పై హైకోర్టు బ్రేక్

హైడల్ ప్రాజెక్ట్ విషయంలోనూ ప్రభుత్వ వాదనని కోర్టు తోసిపుచ్చింది. కొద్ది  రోజుల క్రితం ప్రభుత్వం నవయుగని తప్పించి రివర్స్ టెండరింగ్ కు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపైనే నవయుగ సంస్థ హైకోర్ట్ ని ఆశ్రయించింది. నిబంధనల ప్రకారం వేగంగా పనులు చేస్తున్న తమని తప్పించి రివర్స్ టెండరింగ్ కు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వెళ్తోందంటూ పిటిషన్ దాఖలు చేసింది. 
Previous Post Next Post