గుంటూరు, ఆగస్టు 20 (way2newstv.com):
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వివాదాల పరంపరం కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పటి వరకు కోడెల కుటుంబ సభ్యులు కూమారుడు శివరాం, కూమార్తె విజయలక్ష్మి పై కేసులు నమోదైయాయి. తాజాగా మాజీ స్పీకర్ కోడెలపై తుళ్లూరు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు అసెంబ్లీ సెక్రటరీ. అసెంబ్లీ ఫర్నీచర్ హైదరాబాద్ నుంచి అమరావతి తరలిస్తున్న సమయంలో కోడెల దారి మళ్లీంచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశమైంది. కోడెల కుటుంబ సభ్యులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడారని ఇప్పటి వరకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆ కేసుల నుంచి తన పరువుపోయిందని తల పట్టుకుంటుంటే మళ్లీ కోడెలకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి.
కోడెల కేరాఫ్ వివాదాలు
అసెంబ్లీ ఫర్నీచర్ మాయం అంశం ఇది పోలీసుల వరకు వెళ్లడంపై వివాదం చెలరేగింది. సీఎం జగన్ అయితే ఫర్మీచర్ మాయమైనట్టు వచ్చిన వార్తలపై కోడెల వెంటనే స్పందించారు. హైదరాబాద్ నుంచి అమరావతికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలిస్తుండగా కొంత వినియోగించుకున్నట్టు స్పష్టం చేశారు. గతంలో అనేక సార్లు అసెంబ్లీ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫర్నీచర్ తీసుకువెళ్లాలని కోరినట్టు కోడెల తెలిపారు. ఇప్పటికైనా ఫర్నీచర్ తీసుకెళ్తే తనకు అభ్యంతరం లేదని ప్రకటించారు. లేదంటే ఎంత ఖర్చు అయ్యిందో తెలిపితే నగదు చెల్లిస్తానని చెప్పారు. హైదరాబాద్ నుంచి అసెంబ్లీ ఫర్నీచర్‌ను తరలించారని...సామాన్లు సర్దుబాటు చేసుకొనే క్రమంలో తాను కొన్నింటిని ఉపయోగించుకున్నట్లు ఒప్పుకున్నారు. ఈ విషయంలో అనేక మార్లు అసెంబ్లీ అధికారులకు లిఖితపూర్వకంగా లేఖలు వ్రాసినట్లు చెప్పుకొచ్చారు. సామాగ్రీని తీసుకెళ్లాలని కోరినా..వారు స్పందించలేదన్నారు. ఇప్పటికీ ఫర్నీచర్ అప్పగించేందుకు తాను సిద్ధమని..లేనిపక్షంలో ఎంత ఖర్చు అయ్యిందో చెబితే తాను చెల్లిస్తానని కోడెల తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత 2017 మార్చి వరకు హైదరాబాద్‌లోనే ఏపీ అసెంబ్లీ కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే..సొంతగడ్డపై అమరావతిలో అసెంబ్లీ నిర్వహించాలని అప్పటి సీఎం బాబు నిర్ణయించారు. తాత్కాలిక భవనాన్ని ఏర్పాటు చేశారు. కొత్త భవనానికి సంబంధించిన ఫర్నీచర్‌ను హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించారు. ఆ సమయంలోనే ఫర్నీచర్ మాయమైనట్లు గుర్తించారు. ఫర్నీచర్‌ను సత్తెనపల్లి, నరసరావుపేటకు తరలించారనే వార్తలు వినిపించాయి.
Tags:
political news