హైదరాబాద్, సెప్టెంబర్ 23 (way2newstv.com)
రాష్ట్రంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి అన్నారు. సోమవారం సచివాలయంలో 2018 బ్యాగ్ ఐఏఎస్ అధికారులకు యాపిల్ మాక్ బుక్, ఐఫోన్,ఐ ప్యాడ్ లను సి.యస్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో జి.ఏ.డి స్పెషల్ సి.యస్ అధర్ సిన్హా, డిప్యూటి సెక్రటరి చిట్టిరాణి పాల్గొన్నారు.
అంకిత భావంతో పనిచేయాలి
ఈ సందర్భంగా సి.యస్మాట్లాడుతూ రోజు వారి కార్యకలాపాల నిర్వహణలో సాంకేతికతను వివియోగించుకోవాలని, కార్యచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని అన్నారు. గ్రామాలలో అమలవుతున్న 30 రోజుల ప్రణాళికవివరాలను అడిగి తెలుసుకున్నారు. జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం పట్ల విస్తృతమైన అవగాహనను కల్పించుకోవాలని అన్నారు.
Tags:
telangananews