అమరావతి అక్టోబర్, 28 (way2newstv.com)
జలవనరులశాఖపై సోమవారం ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమీక్ష జరిపారు. కృష్ణా, గోదావరి, పెన్నా బేసిన్లలో ఉన్న రిజర్వాయర్ల నీటిమట్టాలు, ప్రస్తుత పరిస్థితిపై అధికారులు సీఎంకు వివరించారు. ప్రాంతాలు, ప్రాజెక్టులు, జిల్లాల వారీగా జరుగుతున్న పనులపై సీఎంకు వివరాలు అందించారు. ఇప్పటికే పనులు జరుగుతున్న పోలవరం, వెలిగొండ, వంశధార సహా, కొత్త ప్రతిపాదిత ప్రాజెక్టులపైనా అధికారులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ఇంత వరద వచ్చినా కొన్ని ప్రాజెక్టులు పూర్తిగా నింపకపోవడంపై సీఎం ఆరా తీసారు. కాల్వల సామర్థ్యం, పెండింగులో ఉన్న పనులపై అధికారుల నుంచి సమాచారం కోరారు.
జలవనరుల శాఖపై సీఎం జగన్ సమీక్ష
వరదజలాలు వచ్చే 40 రోజుల్లో అన్ని ప్రాజెక్టులు నిండేలా కార్యాచరణ సిద్ధంచేయాలన్న సీఎం, దీనిపై ప్రతిపాదనలతో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ప్రస్తుతం నడుస్తున్న, తప్పకుండా కొత్తగా చేపట్టాల్సిన ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో విభజించి ఆమేరకు అంచనాలను ఈ నివేదికద్వారా ఇవ్వాలని ఆదేశించారు. నిధుల వినియోగంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ప్రాధాన్యతల పరంగా ఖర్చు చేయాలి. చేసిన ఖర్చుకు ఫలితాలు వచ్చేలా ఉండాలని అన్నారు. భూసేకరణ, అటవీ అనుమతుల సమస్యల కారణంగా చాలావరకు జలయజ్ఞం పనులు పెండింగులో ఉండిపోతున్నాయన్న అధికారులు, వీటికి మొదట ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రికి వివరించారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్న సీఎం, ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు.
Tags:
Andrapradeshnews