కేపీహెచ్‌బీ కాలనీలో ఆధునిక చేపల మార్కెట్‌ ప్రారంభం

హైదరాబాద్ నవంబర్ 14   (way2newstv.com)
నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన చేపల మార్కెట్‌ను మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి ప్రారంభించారు. రూ. 2.78 కోట్ల వ్యయంతో ఈ చేపల మార్కెట్‌ను నిర్మించారు. అదేవిధంగా రూ. 83 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆర్‌ఓబీ, ఇతర పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. 
కేపీహెచ్‌బీ కాలనీలో ఆధునిక చేపల మార్కెట్‌ ప్రారంభం

ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, ఎమ్మెల్సీలు నవీన్‌రావు, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష కుమార్, టీఆర్‌ఎస్ నాయకులు మర్రి రాజశేఖర్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
Previous Post Next Post