లక్షటిపెట్: మంచిర్యాల్ డిసెంబర్19 (way2newstv.com)
మండలంలోని లక్మిపూర్ గ్రామంలో పంటపొలం లో పెద్దపులి అడుగులు రైతులు గుర్తించారు పెద్దపులి అడుగులు గుర్తించిన రైతులువెంటనేఅటవీశాఖ అధికారులకుసమాచారం అందించారు సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని అడుగులు పరిశీలించి ఇవి పెద్దపులి అడుగులేనని గుర్తించారు ఈ సందర్భంగా అటవీ క్షేత్రాధికారి లకవత్ స్వామి మాట్లాడుతూ ఇక్కడ పెద్దపులి సంచరించడం వాస్తవమే అని అన్నారు .
పెద్దపులి అడుగులు గుర్తించిన రైతులు
ఇప్పటికే తాళ్లపెట్ రేంజ్ తో పాటు లక్షటిపెట్ రేంజ్ పరిధిలోని గాడ్పుర్ తిర్యాని గుండాల ప్రాంతాల్లో పెద్దపులి సంచరించినట్లు సీసీ కెమెరాలకు చిక్కింది అని అన్నారు పులి వచ్చి దాని దారిన అది వెళ్ళిపోతుంది కానీ దానికి ఎవరు హాని చేయరాదని ఆయన అన్నారు పులి దాక్కోవడానికి ఇది అనుకూలమైన స్థలమని ఆయన అన్నారు ముఖ్యంగా రైతులు పంట పొలాలకు విద్యుత్ వైర్లు వేయారదని ఒకవేళ పులికి ఎటువంటి హాని కలిగించిన వారికి చట్టపరమైన శిక్షర్వులు అవుతారని ఆయన అన్నారు ఒకవేళ పులిద్వారా ఎవరికైనా హాని కల్గుతే ప్రభుత్వం నుండినష్టపరిహారం అందుతుందని ఆయన అన్నారు అనుమతిలేనిది అటవీ ప్రాంతంకు వెళ్లరాదని పశువులు అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారదని ఆయన తెలిపారు